BREAKING
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలి :జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్.. అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్.. నో యువర్ లీడర్’ సమనస జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని భవ్య శ్రీ.. పరిమళ ప్రసాదం కొరత తీర్చేందుకు మెగా ప్రాజెక్టు ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. 17వ డివిజన్‌లో అదరగొట్టిన ఫ్లాష్ మాబ్స్.. - విజయవాడ ఉత్సవ్ 2.0కు విస్తృత ప్రచారం ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయిలో పరిష్కరించాలి సాంప్రదాయ విలువలను భావితరాలకు అందించాలి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ దసరా విశేష సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల దసరా ఏర్పాట్లపై దేవాదాయ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన పేద కుటుంబాలకు అండగా నిలుస్తాం.. సమాజ సేవకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి బీసీలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్లు నేటి రాశి ఫలాలు: 6 అక్టోబర్ 2026 (మంగళవారం) రాజ్‌కుమార్ సేవా స్ఫూర్తి చిరస్మరణీయం : ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నేటి పంచాంగం: 6 అక్టోబర్ 2026 (మంగళవారం)

బాల న్యాయ వ్యవస్థపై పోలీసులకు అవగాహన

Select Suryaa Now
బాల న్యాయ వ్యవస్థపై పోలీసులకు అవగాహన

విజయవాడ క్రైం,  మేజర్ న్యూస్ : బాలల కేసుల్లో పోలీసులు అనుసరించాల్సిన చట్టాలు, నిబంధనలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు సూచించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అడ్మిన్ డీసీపీ కె.జి.వి.సరితతో కలిసి ప్రాజెక్ట్ రెస్క్యూ ఫౌండేషన్ సౌజన్యంతో రూపొందించిన బాల న్యాయ వ్యవస్థ, పిల్లల సంరక్షణ–రక్షణ చట్టం, నిబంధనలపై అవగాహన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. 18 ఏళ్లలోపు బాలబాలికల కేసుల్లో పోలీసు అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అధికారులకు ఇదే అంశంపై అవగాహన కల్పించేందుకు ఆన్‌లైన్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. పిల్లల హక్కుల పరిరక్షణకు, వారికి న్యాయం, పునరావాసం కల్పించేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందన్నారు. అత్యవసర సహాయం కోసం 100 లేదా బాలల సహాయవాణి 1098కు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ రెస్క్యూ ఫౌండేషన్‌కు చెందిన డా. మాథ్యూ కె. డానియల్ తదితరులు పాల్గొన్నారు.

✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ.