BREAKING
మర్పల్లిలో బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి 200 మంది చేరిక సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం ప్రశాంతమ్మకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు *పత్రికా ప్రకటన* *తేదీ: 22.11.2026* *ప్రశాంతి రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సర్వమత ప్రార్థనలు* *- నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వీపీఆర్ దంపతులను ఆశీర్వదించిన మత పెద్దలు* కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం వ్యాధుల నివారణ, ప్రెసిషన్ మెడిసిన్ వైపు భారత్ వైద్య పరిశోధనల అడుగులు 250 మందికి ఉచిత వైద్య సేవలు చిన్నారుల మధ్య ఘనంగా ప్రశాంతమ్మ జన్మదిన వేడుకలు చారిత్రక చంగిస్ ఖాన్ పేట 5వ వార్డు సభ్యురాలిగా ఇనాదుల శిరీష ఏకగ్రీవం దేవంపల్లి గ్రామ పాలచెరువుకు జలకళ.. ముందస్తు చర్యలతో రైతులకు భరోసా! అధిష్ఠానం ఆదేశాలను నూరు శాతం పాటిస్తా పంచాయతీల్లో పోటీ వద్దు...ఏకగ్రీవాలకే మొగ్గు బలహీనపడిన అక్వాన్ తుపాను కురువ శశికళ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను శుభాకాంక్షలు తెలిపిన బుట్టా రేణుక,బుట్టా శివ నీలకంఠ దంపతులు ఈశాన్య ప్రాంత అభివృద్ధి, యువత ఉపాధే మోదీ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యం రాజు బాంగారుపాలెం ఫ్లాగ్ మార్చ్

అధిష్ఠానం ఆదేశాలను నూరు శాతం పాటిస్తా

Select Suryaa Now
అధిష్ఠానం ఆదేశాలను నూరు శాతం పాటిస్తా

హైదరాబాద్: పార్టీ అధిష్ఠానం ఇచ్చే ప్రతి ఆదేశాన్ని తాను నూరు శాతం పాటిస్తానని, రాష్ట్రంలో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో పాల్గొన్న ఆయన, రాష్ట్ర రాజకీయ పరిణామాలు మరియు సాగునీటి ప్రాజెక్టుల అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వాల తీరును ప్రస్తావిస్తూ.. 2022లో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే పల్నాడు వాటర్ గ్రిడ్ పథకం రూపుదిద్దుకుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ 'జల్ జీవన్ మిషన్' కింద రూ. 1,580 కోట్ల వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టుకు 2022లోనే జీవో (GO) విడుదలైందని ఆయన గుర్తు చేశారు. అలాగే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో నాటి టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) భాగస్వామిగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు మొదలైందని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క కొత్త ప్రాజెక్టును కూడా చేపట్టలేదని సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.