చికిత్స పొందుతూ రమేష్ మృతి
చికిత్స పొందుతూ రమేష్ మృతి
చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట క్రాస్ వద్ద రెండు రోజుల క్రితం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రమేష్ మృతి చెందారు. తీవ్ర గాయాలతో హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం కొద్దిసేపటి క్రితం మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.