telangana
గంగుల కమలాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన DHRC ప్రతినిధులు
సూర్య కరీంనగర్ : డెమోక్రటిక్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (DHRC) చైర్మన్ ఐలనేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, DHRC ప్రతినిధులు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం, క్యాలెండర్, శాలువా అందజేసి గౌరవించారు.
ఈ కార్యక్రమంలో DHRC జిల్లా అధ్యక్షుడు ఊరేడి ఆనంద్, ప్రధాన కార్యదర్శి ఎండీ రఫీ, జాయింట్ సెక్రటరీ ఊరేడి రమేష్, నాగన్న పాల్గొన్నారు. ప్రజా సమస్యలు, మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాల పట్ల DHRC చేపడుతున్న కృషిని ఎమ్మెల్యేకు వివరించారు. మానవ హక్కుల పరిరక్షణ, ప్రజాసేవే తమ ప్రధాన లక్ష్యమని ప్రతినిధులు పేర్కొన్నారు.