ఒక్కసారి సర్పంచ్ గా గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా... అభ్యర్థి తిప్పేస్వామి
ఒక్కసారి సర్పంచ్ గా గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా... అభ్యర్థి తిప్పేస్వామి
హొళగుంద, సూర్య ప్రతినిధి:
ఒక్కసారి సర్పంచ్ గా గెలిపించండి గ్రామ అభివృద్ధి చేసి చూపిస్తానని హొళగుంద మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఎరుకుల తిప్పేస్వామి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.ఆదివారం గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు.హొళగుంద సర్పంచ్ స్థానం ఎస్టి రిజర్వేషన్ కావడంతో ఆయన సర్పంచ్ బరిలో నిలిచారు.గతంలో సర్పంచ్ గా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిందని మళ్ళీ ఇప్పుడు అవకాశం రావడంతో నేను మరోసారి బరిలో నిలినట్లు చెప్పారు. బ్యాలెట్ పేపర్ ఒకటో నెంబర్ లో ఉన్న మంచం గుర్తుకి తమ అమూల్యమైన ఓట్లను వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓట్లర్లను అభ్యర్థించారు. ఒకసారి గా ఆదరించి అభిమానించి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
టి.ఉమాపతి, సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా.