BREAKING
*జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ* తొలి అడుగు..ఉమాదేవి సంచలనం! వైభవంగా తులసి దామోదర కళ్యాణం *నూతన వధూవరులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి* గురు నానక్ ప్రకాష్ పర్వ్ వేడుకలకు పాకిస్థాన్ బయలుదేరిన 1,822 మంది సిక్కు యాత్రికులు సహజ ప్రసవమే శ్రేయస్కరం.. తల్లీబిడ్డలకు ఆరోగ్యకరం - అనవసర సిజేరియన్లను నివారించాలి - డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజగోపాల్ రావు పప్పు దినుసుల రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ - చొప్పదండి సహకార సంఘం వినూత్న కార్యక్రమం ఆదర్శనీయం - కలెక్టర్ చిత్రా మిశ్రా ముంబై వేదికగా హిందూపురం-ప్రపంచ మేయర్ల సదస్సులో కమిషనర్ మల్లికార్జున.. రాజ్యసభ ఎంపీ రాంరావ్ వాడ్‌కుటే మృతి.. ప్రధాని మోదీ తీవ్ర సంతాపం గంగుల కమలాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన DHRC ప్రతినిధులు రోడ్డు ప్రమాద బాధితులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ అదుపుతప్పి తాడిచెట్టును ఢీకొన్న కారు.. కాలువలోకి దూసుకెళ్లిన వాహనం వైసిపి రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి శశికళ కృష్ణమోహన్ కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకల్లో నాయకుల సందడి పేద కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా భరోసా –ప్రజా ప్రభుత్వానికి అభినందనలు:* కోటా రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి

అదుపుతప్పి తాడిచెట్టును ఢీకొన్న కారు.. కాలువలోకి దూసుకెళ్లిన వాహనం

Select Suryaa Now
అదుపుతప్పి తాడిచెట్టును ఢీకొన్న కారు.. కాలువలోకి దూసుకెళ్లిన వాహనం

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం మేజర్ న్యూస్: 

బల్లికురవ–కొమ్మలపాడు ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.అదుపుతప్పిన ఓ కారు రహదారి పక్కనే ఉన్న తాడిచెట్టును బలంగా ఢీకొని,పక్కనే ఉన్న మార్జిన్ కాలువలోకి దూసుకెళ్లింది.ఏపీ 37 సీటీ 7777 నంబరు కలిగిన కారు ప్రమాదానికి గురైనట్లు తెలిసింది.తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే వాహనం అదుపుతప్పి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో ఉన్నారు.ఆదివారం సాయంత్రం వరకు కూడా ప్రమాదానికి గురైన కారును తీసుకెళ్లేందుకు ఎవరూ సంఘటనా స్థలానికి రాకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా?కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

కొణిదెన నరేంద్ర:బల్లికురవ మండలం సూర్య రిపోర్టర్