ఆప్యాయ పలకరింపులతో ఓటర్లను ఆకట్టుకుంటున్న మోదుగుమూడి వెంకటేశ్వరరావు.
గన్నవరం గ్రామ వైఎస్సార్‌సీపీ సర్పంచి అభ్యర్థి మోదుగుముడి వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి ఆదరాభిమానాలు పొందుతున్నారు. కులమతాలకు అతీతంగా అందరితో కలిసిమెలిసి సాగుతున్న ఆయన ప్రచారం గ్రామంలో ప్రత్యేకంగా కనిపిస్తోంది. ప్రజలతో మమేకమవుతూ గ్రామ సమస్యలు, స్థానిక అవసరాలపై ఆరా తీస్తున్నారు. అందరినీ కలుపుకొని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తూ ఓటర్ల మద్దతు కోరుతున్నారు. ప్రచారంలో ఆయన చూపుతున్న ఆత్మీయత, ప్రజలతో మెలిగే తీరు ఓటర్లలో ఆకట్టుకుంటోంది. సర్పంచి అభ్యర్థిగా తనకు కేటాయించిన గంప గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మోదుగుముడి వెంకటేశ్వరరావు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గన్నవరం మండల జడ్పీటీసీ అనగాని రవి, గౌషాని, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్ :: గుర్రం ప్రసాద్ ,గన్నవరం, కృష్ణా జిల్లా.