BREAKING
*జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ* తొలి అడుగు..ఉమాదేవి సంచలనం! వైభవంగా తులసి దామోదర కళ్యాణం *నూతన వధూవరులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి* గురు నానక్ ప్రకాష్ పర్వ్ వేడుకలకు పాకిస్థాన్ బయలుదేరిన 1,822 మంది సిక్కు యాత్రికులు సహజ ప్రసవమే శ్రేయస్కరం.. తల్లీబిడ్డలకు ఆరోగ్యకరం - అనవసర సిజేరియన్లను నివారించాలి - డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజగోపాల్ రావు పప్పు దినుసుల రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ - చొప్పదండి సహకార సంఘం వినూత్న కార్యక్రమం ఆదర్శనీయం - కలెక్టర్ చిత్రా మిశ్రా ముంబై వేదికగా హిందూపురం-ప్రపంచ మేయర్ల సదస్సులో కమిషనర్ మల్లికార్జున.. రాజ్యసభ ఎంపీ రాంరావ్ వాడ్‌కుటే మృతి.. ప్రధాని మోదీ తీవ్ర సంతాపం గంగుల కమలాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన DHRC ప్రతినిధులు రోడ్డు ప్రమాద బాధితులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ అదుపుతప్పి తాడిచెట్టును ఢీకొన్న కారు.. కాలువలోకి దూసుకెళ్లిన వాహనం వైసిపి రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి శశికళ కృష్ణమోహన్ కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకల్లో నాయకుల సందడి పేద కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా భరోసా –ప్రజా ప్రభుత్వానికి అభినందనలు:* కోటా రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి

ముంబై వేదికగా హిందూపురం-ప్రపంచ మేయర్ల సదస్సులో కమిషనర్ మల్లికార్జున..

Select Suryaa Now
ముంబై వేదికగా హిందూపురం-ప్రపంచ మేయర్ల సదస్సులో కమిషనర్ మల్లికార్జున..

ముంబై వేదికగా హిందూపురం-ప్రపంచ మేయర్ల సదస్సులో కమిషనర్ మల్లికార్జున


హిందూపురం టౌన్ మేజర్ న్యూస్:


హిందూపురం
మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున అంతర్జాతీయ స్థాయి సదస్సుకు ఎంపికయ్యారు.
ఈ నెల 25, 26 తేదీల్లో ముంబైలో నిర్వహించనున్న మూడవ ప్రపంచ మేయర్ల సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన మున్సిపల్ కమిషనర్ల జాబితాలో ఆయనకు చోటు లభించింది.
రాష్ట్ర పురపాలక పరిపాలన శాఖ కమిషనర్, సంచాలకులు డాక్టర్ పి. సంపత్ కుమార్ ఈ మేరకు ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేశారు.
అఖిల భారత స్థానిక స్వపరిపాలన సంస్థ వందేళ్ల వేడుకల్లో భాగంగా ఈ అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మేయర్లు, మున్సిపల్ కమిషనర్లు, పట్టణ ప్రణాళిక నిపుణులు ఈ సదస్సులో పాల్గొని పట్టణ అభివృద్ధి, పరిశుభ్రత, స్మార్ట్ సిటీ అంశాలపై చర్చించనున్నారు.
హిందూపురం పట్టణంలో పారిశుధ్యం, అభివృద్ధి పనుల్లో కమిషనర్ మల్లికార్జున చేస్తున్న కృషికి ఈ ఎంపిక గుర్తింపుగా నిలిచింది.
ఈ ఎంపిక పట్ల పట్టణ ప్రజలు, మున్సిపల్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

నేటి దినపత్రిక సూర్య టౌన్రిపోర్టర్ ఎం .నాగరాజు హిందూపురం