BREAKING
*జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ* తొలి అడుగు..ఉమాదేవి సంచలనం! వైభవంగా తులసి దామోదర కళ్యాణం *నూతన వధూవరులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి* గురు నానక్ ప్రకాష్ పర్వ్ వేడుకలకు పాకిస్థాన్ బయలుదేరిన 1,822 మంది సిక్కు యాత్రికులు సహజ ప్రసవమే శ్రేయస్కరం.. తల్లీబిడ్డలకు ఆరోగ్యకరం - అనవసర సిజేరియన్లను నివారించాలి - డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజగోపాల్ రావు పప్పు దినుసుల రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ - చొప్పదండి సహకార సంఘం వినూత్న కార్యక్రమం ఆదర్శనీయం - కలెక్టర్ చిత్రా మిశ్రా ముంబై వేదికగా హిందూపురం-ప్రపంచ మేయర్ల సదస్సులో కమిషనర్ మల్లికార్జున.. రాజ్యసభ ఎంపీ రాంరావ్ వాడ్‌కుటే మృతి.. ప్రధాని మోదీ తీవ్ర సంతాపం గంగుల కమలాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన DHRC ప్రతినిధులు రోడ్డు ప్రమాద బాధితులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ అదుపుతప్పి తాడిచెట్టును ఢీకొన్న కారు.. కాలువలోకి దూసుకెళ్లిన వాహనం వైసిపి రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి శశికళ కృష్ణమోహన్ కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకల్లో నాయకుల సందడి పేద కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా భరోసా –ప్రజా ప్రభుత్వానికి అభినందనలు:* కోటా రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి

వైసిపి రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి శశికళ కృష్ణమోహన్ కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకల్లో నాయకుల సందడి

Select Suryaa Now
వైసిపి రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి శశికళ కృష్ణమోహన్ కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకల్లో నాయకుల సందడి

 

హొళగుంద, సూర్య ప్రతినిధి:
వైసిపి రాష్ట్ర మహిళా వివాహ ప్రధాన కార్యదర్శి, బళ్ళారి మాజీ డిప్యూటీ మేయర్ శశికళ కృష్ణమోహన్ కుమారుడు హర్షిత్ తేజ వివాహ రిసెప్షన్ వేడుకల్లో ఆదివారం నాయకులు సందడి చేశారు. బళ్లారి హలూమ్ భవన్ ఫంక్షన్ హాల్ లో వివాహ రిసెప్షన్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.కార్యక్రమానికి మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, వైసిపి నాయకులు, కురువ సంఘ నాయకులు,బందు వర్గాలు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు అధిక సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ వేడుకలకు హాజరైన నాయకులను గోరవయ్యల ద్వారా ఘనంగా ఆహ్వానం పలికించారు.కార్యక్రమంలో మాజీమంత్రి శ్రీరాములు, మాజీ పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుకమ్మ,బళ్లారి ఎమ్మెల్యే భరత్ రెడ్డి,మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, వివిధ హోదాలో ఉన్న నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో హొళగుంద వైసిపి నాయకులు ఆసిఫ్, తవాఫ్,బాషు,సిద్ధప్ప మండలంలో వివిధ గ్రామాల నుండి నాయకులు, కార్యకర్తల హాజరయ్యారు. 
టి.ఉమాపతి, సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా.