BREAKING
*జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ* తొలి అడుగు..ఉమాదేవి సంచలనం! వైభవంగా తులసి దామోదర కళ్యాణం *నూతన వధూవరులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి* గురు నానక్ ప్రకాష్ పర్వ్ వేడుకలకు పాకిస్థాన్ బయలుదేరిన 1,822 మంది సిక్కు యాత్రికులు సహజ ప్రసవమే శ్రేయస్కరం.. తల్లీబిడ్డలకు ఆరోగ్యకరం - అనవసర సిజేరియన్లను నివారించాలి - డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజగోపాల్ రావు పప్పు దినుసుల రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ - చొప్పదండి సహకార సంఘం వినూత్న కార్యక్రమం ఆదర్శనీయం - కలెక్టర్ చిత్రా మిశ్రా ముంబై వేదికగా హిందూపురం-ప్రపంచ మేయర్ల సదస్సులో కమిషనర్ మల్లికార్జున.. రాజ్యసభ ఎంపీ రాంరావ్ వాడ్‌కుటే మృతి.. ప్రధాని మోదీ తీవ్ర సంతాపం గంగుల కమలాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన DHRC ప్రతినిధులు రోడ్డు ప్రమాద బాధితులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ అదుపుతప్పి తాడిచెట్టును ఢీకొన్న కారు.. కాలువలోకి దూసుకెళ్లిన వాహనం వైసిపి రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి శశికళ కృష్ణమోహన్ కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకల్లో నాయకుల సందడి పేద కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా భరోసా –ప్రజా ప్రభుత్వానికి అభినందనలు:* కోటా రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి

వెల్దుర్తి సర్పంచ్ పదవికి ఎల్.ఇ. పుష్పావతి, ఎల్.ఇ. శ్వేత నామినేషన్ల దాఖలు పట్టణంలో వేడెక్కిన పంచాయతీ ఎన్నికల వాతావరణం

Select Suryaa Now
వెల్దుర్తి సర్పంచ్ పదవికి ఎల్.ఇ. పుష్పావతి, ఎల్.ఇ. శ్వేత నామినేషన్ల దాఖలు పట్టణంలో వేడెక్కిన పంచాయతీ ఎన్నికల వాతావరణం

వెల్దుర్తి, మేజర్ న్యూస్ : వెల్దుర్తి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎల్.ఇ. పుష్పావతి, ఎల్.ఇ. శ్వేత తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ మేరకు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి వారు తమ నామినేషన్లను అందజేశారు.వెల్దుర్తి పట్టణంలో మేజర్ గ్రామ పంచాయతీ కావడంతో సర్పంచ్ స్థానం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారింది. నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో భాగంగా అభ్యర్థులు ఎల్.ఇ. పుష్పావతి, ఎల్.ఇ. శ్వేత తమ మద్దతుదారులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెల్దుర్తి మేజర్ గ్రామ పంచాయతీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. పట్టణంలో నెలకొన్న ప్రధాన సమస్యలైన తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, అంతర్గత రహదారుల నిర్మాణం, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజలందరూ తమను ఆశీర్వదించి, భారీ మెజారిటీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు.