*జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ*
*జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ*
ఛాంపియన్‌షిప్ ట్రోఫీ కైవసం చేసుకున్న విద్యార్థులు
చేర్యాల మేజర్ న్యూస్ ......
చేర్యాల: 12వ జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్–2026లో చేర్యాల మండలం ముస్త్యాల తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. పాఠశాలలో రెండో సంవత్సరం చదువుతున్న బాలుర విభాగం విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ఛాంపియన్‌షిప్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రాంబాబు, ఫిజికల్ డైరెక్టర్ మారికొండ బాబు, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి పాఠశాలకు గుర్తింపు తీసుకువచ్చిన విద్యార్థులను ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.