హెల్మెట్‌తోనే ప్రయాణం సురక్షితం :ఎ.వెంకటేశ్వర్లు
హెల్మెట్‌తోనే ప్రయాణం సురక్షితం :ఎ.వెంకటేశ్వర్లు
చీరాల: రోడ్డు ప్రమాదాల నివారణకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రెండో పట్టణ ఎస్సై ఎ.వెంకటేశ్వర్లు సూచించారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం నుంచి రక్షణ పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.ఆదివారం హాయ్ రెస్టారెంట్ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఎస్సై ఆధ్వర్యంలో వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై, శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ నిత్యం చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది శక్తి యాప్ సిబ్బంది సునీత పలువురు వాహనదారులు పాల్గొన్నారు.