BREAKING
ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్లకు సువర్ణావకాశం వైఫల్యాలకు భయపడకండి, మీ కృషే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ పిలుపుతో భారీ నష్టాల నుంచి తప్పించుకున్నాం రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మెట్లకుంట విద్యార్థి రిహాన్ ఎంపిక ఎన్నికల విధుల్లోని ఉద్యోగులకు రేపు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు!! తాండూరులో ఈ నెల 25న అయ్యప్ప స్వామి మహా పడిపూజ ప్రజా సేవకు వయసుతో పనిలేదు ఎంపీపీ మధుబాబు ఆధ్వర్యంలో వైసీపీనివీడు టిడిపిలో చేరిన ముస్లింలు గిద్దలూరు శ్రీ సాయి చైతన్య డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా ఒక్కసారి సర్పంచ్ గా గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా... అభ్యర్థి తిప్పేస్వామి హెల్మెట్‌తోనే ప్రయాణం సురక్షితం :ఎ.వెంకటేశ్వర్లు చికిత్స పొందుతూ రమేష్ మృతి పొదిలి పట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేస్తాం - మార్కాపురం శాసనసభ్యులు కందుల *జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ* తొలి అడుగు..ఉమాదేవి సంచలనం!

తాండూరులో ఈ నెల 25న అయ్యప్ప స్వామి మహా పడిపూజ

Select Suryaa Now
తాండూరులో ఈ నెల 25న అయ్యప్ప స్వామి మహా పడిపూజ

తాండూరు, మేజర్ న్యూస్: తాండూరు పట్టణంలో ఈ నెల 25వ తేదీ బుధవారం అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. అయ్యప్ప స్వామిపై అపార భక్తిభావం కలిగిన పైలెట్ రోహిత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముందుకు సాగుతున్నారు. మహా పడిపూజకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు.