ఎంపీపీ మధుబాబు ఆధ్వర్యంలో వైసీపీనివీడు టిడిపిలో చేరిన ముస్లింలు
ఎంపీపీ ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన ముస్లిం కుటుంబాలు
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ముస్లింలు వైయస్సార్సీపి పార్టీని వీడి టిడిపి పార్టీలో చేరినట్లు ఎంపీపీ తేనె మధుబాబు తెలిపారు. ఆదివారం వెంకటాపురం గ్రామానికి చెందిన 30 ముస్లిం కుటుంబాలు టిడిపిలో చేరగా ఎంపీపీ మధుబాబు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈశ్వర్ రెడ్డి, శివారెడ్డిలో పార్టీ కండువాలతో సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామాల్లో చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఎన్నడూ లేని విధంగా శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశారని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటూ ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసి నియోజకవర్గ ప్రజల హృదయాల్లో సేవకు మారుపేరుగా ముద్ర వేసుకున్న ఘనత ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దే అని అన్నారు. తెలుగుదేశంపార్టీలో చేరిన వారిలో వేల్పనూరు అలీ భాష, మౌలాలి, సైఫుద్దీన్, నబి రసూల్ తదితరులు పాల్గొన్నారు.