తొలి అడుగు..ఉమాదేవి సంచలనం!
తొలి అడుగు..ఉమాదేవి సంచలనం!
చీరాల మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగిన 35వ వార్డు కౌన్సిలర్ మూలి ఉమాదేవి విజయదుందుభి మోగించారు. కాంగ్రెస్, వైసీపీ అభ్యర్థులను వెనక్కి నెట్టి ఏకంగా 747 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొత్తం 44 వార్డుల్లో గెలిచిన అభ్యర్థుల మెజార్టీల్లోనే టాప్‌గా నిలిచి తన సత్తా చాటారు.తొలి ఎన్నికలోనే ఇంతటి ఘనవిజయం సాధించడం చీరాల రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఉమాదేవి విజయానికి భర్త, స్థానికంగా రాజకీయ పట్టు ఉన్న మూలి శ్రీనివాసరెడ్డి వ్యూహాలు, రాజకీయ చాణక్యం ప్రధాన బలంగా నిలిచాయని స్థానికంగా చర్చ సాగుతోంది. తొలి ప్రయత్నంలోనే భారీ విక్టరీ.. చీరాలలో ఉమాదేవి పేరు మారుమోగుతోంది!