కొండ్రపోల్‌లో దోతి ఫంక్షన్‌కు హాజరైన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
కొండ్రపోల్‌లో దోతి ఫంక్షన్‌కు హాజరైన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్ : ఆదివారం కొండ్రపోల్ గ్రామానికి చెందిన కొండా సైదులు గౌడ్, శైలజ దంపతుల కుమారులు కొండా మౌర్య రక్షిత్ గౌడ్, కొండా ఆర్య దీక్షిత్ గౌడ్‌ల దోతి ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. అనంతరం కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి, స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.