BREAKING
రోడ్డు ప్రమాద బాధితులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ అదుపుతప్పి తాడిచెట్టును ఢీకొన్న కారు.. కాలువలోకి దూసుకెళ్లిన వాహనం వైసిపి రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి శశికళ కృష్ణమోహన్ కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకల్లో నాయకుల సందడి పేద కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా భరోసా –ప్రజా ప్రభుత్వానికి అభినందనలు:* కోటా రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి కొండ్రపోల్‌లో దోతి ఫంక్షన్‌కు హాజరైన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రాంతీయ భాషల ఏఐతో వైద్య సమాచారం మరింత చేరువ ముంబై వేదికగా హిందూపురం-ప్రపంచ మేయర్ల సదస్సులో కమిషనర్ మల్లికార్జున.. కొనిదెన బ్రహ్మగుండం క్షేత్రంలో రెండు తలల నాగసర్పం దర్శనం.. భక్తుల్లో భక్తిభావం వెల్దుర్తి సర్పంచ్ పదవికి ఎల్.ఇ. పుష్పావతి, ఎల్.ఇ. శ్వేత నామినేషన్ల దాఖలు పట్టణంలో వేడెక్కిన పంచాయతీ ఎన్నికల వాతావరణం ములాయం సింగ్ యాదవ్ జయంతి ఆప్యాయ పలకరింపులతో ఓటర్లను ఆకట్టుకుంటున్న మోదుగుమూడి వెంకటేశ్వరరావు. మీనాక్షి నటరాజన్ సేవలు మరువలేని: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 2047 నాటికి 26.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం కళ్యాణదుర్గంలో బోల్తా పడిన ఆటో... తృతిలో తప్పిన పెను ప్రమాదం.

మీనాక్షి నటరాజన్ సేవలు మరువలేని: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

Select Suryaa Now
మీనాక్షి నటరాజన్ సేవలు మరువలేని: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
 
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధి 
: ఏఐసీసీ తెలంగాణ నూతన ఇన్‌ఛార్జిగా నియమితులైన బి.ఎం. సందీప్ రాజకీయ అనుభవం, నాయకత్వ లక్షణాలు కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తాయని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. చిక్‌మగళూరులో జన్మించిన బి.ఎం. సందీప్ చిన్నతనం నుంచే రాజకీయాల్లోకి వచ్చారని, తన రాజకీయ ప్రస్థానంలో అనేక కీలక పదవులు చేపట్టి విశేష అనుభవాన్ని సంపాదించారని తెలిపారు. ఎం.బి. పాటిల్, రమేష్ చెన్నితల వంటి నాయకుల ఆధ్వర్యంలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉందన్నారు.
తెలంగాణలో ఏడాది పాటు ఇన్‌ఛార్జిగా పనిచేసిన మీనాక్షి నటరాజన్ పార్టీపై తనదైన ప్రత్యేక ముద్ర వేశారని మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. అణగారిన వర్గాలకు అండగా నిలిచేందుకు ఆమె విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఆమె నాయకత్వంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటిందని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్‌కు అందించిన సేవలకు మీనాక్షి నటరాజన్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన చర్యలపై దృష్టి సారించారని చెప్పారు. అయితే కరువు ముప్పు ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో ఎలాంటి సహకారం అందడం లేదని విమర్శించారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీలు నిర్వహించిందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన భారీ ర్యాలీకి తెలంగాణ నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పార్టీ పోరాటానికి సంఘీభావం తెలిపారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఏ రవీందర్, హైదరాబాద్.