BREAKING
ఐతాబాద్ ట్రేఫోయిల్ ప్యాకింగ్ కంపెనీలో అగ్నిప్రమాదం కౌశిక్ రెడ్డి రాజీనామాకు సిద్ధమాః కాంగ్రెస్‌ నేత వొడితల ప్రణవ్ మియాపూర్‌లోని 850 ఎకరాలు విద్యాసంస్థలకు కేటాయించాలిః ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు మానవత్వం..*బాధిత కుటుంబానికి భరోసా* తెలంగాణ కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలిః మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం గత ఎన్నికల అనుభవంతో మళ్లీ ప్రజాక్షేత్రంలోకి సాయిప్రసాద్.. ప్రజాసేవే లక్ష్యంగా స్వతంత్ర నామినేషన్! ఓటు హక్కును హరించే కుట్రలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలిః సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా విశ్వహిందూ పరిషత్ ‘హితచింతక్’ సభ్యత్వ నమోదు పోలియో రహిత సమాజమే లక్ష్యం ప్రతి చిన్నారికి రెండు చుక్కలు తప్పనిసరి ఐకమత్యమే కాంగ్రెస్ విజయ రహస్యంః ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్ కుమార్ అక్రమంగా తరలిస్తున్న పశువుల రవాణా ముఠా అరెస్ట్ ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి బీఎం సందీప్ కుమార్‌కు ఘన స్వాగతం పార్టీ నూతన ఇన్‌చార్జ్ బీ.ఎం. సందీప్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వాకిటి ఈహెచ్ఎస్ మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన 200 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు.. 8 మందికి తదుపరి చికిత్సకు అనుమతులు

వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు మానవత్వం..*బాధిత కుటుంబానికి భరోసా*

Select Suryaa Now
వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు మానవత్వం..*బాధిత కుటుంబానికి భరోసా*

*సూర్య ఆర్ సి అశ్వారావుపేట :*మానవత్వం చాటుకున్నారు అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు. కష్టంలో ఉన్న కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచి, తన పెద్ద మనసును చాటుకున్నారు. అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త జూపల్లి అంజిబాబు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం ఊట్లపల్లి గ్రామంలో నిర్వహించిన అంజిబాబు పెద్దకర్మ కార్యక్రమానికి వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు స్వయంగా హాజరయ్యారు.ముందుగా మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన రమేష్ బాబు, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంజిబాబు పార్టీ కోసం నిబద్ధతతో పని చేసిన నమ్మిన కార్యకర్త అని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ “అంజిబాబు లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరు. కానీ అతని కుటుంబానికి నేను ఎల్లప్పుడూ అండగా ఉంటాను. ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా నన్ను సంప్రదించండి. ఆర్థికంగా, మానసికంగా అన్ని విధాలా భరోసా కల్పిస్తాను. ప్రభుత్వ పరంగా రావాల్సిన సాయం కూడా అందేలా చూస్తాను” అని హామీ ఇచ్చారు.రమేష్ బాబు మాటలకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో అండగా నిలిచిన నాయకుడిగా రమేష్ బాబును గ్రామస్తులు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.

సూర్య రిపోర్టర్ మునీర్ ఆర్ సి అశ్వరావుపేట