ఘనంగా విశ్వహిందూ పరిషత్ ‘హితచింతక్’ సభ్యత్వ నమోదు
గుంటూరు: ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ అయిన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) ఆధ్వర్యంలో 'హితచింతక్' సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం అమరావతిలోని శ్రీ అమరేశ్వర స్వామి దేవాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. వీహెచ్పీ అమరావతి మండల అధ్యక్షులు మేకల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రతినిధులు, సంఘ పెద్దలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ హిందూ ధర్మ రక్షణ, హిందూ సంఘటన లక్ష్యంగా 1964 శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు పూజ్య పీఠాధిపతులు, ధర్మాచార్యులు, సామాజికవేత్తల మార్గదర్శనంలో పూజనీయ గురూజీ గోళ్వల్కర్ నేతృత్వంలో విశ్వహిందూ పరిషత్ స్థాపించబడిందని తెలిపారు. "మమ దీక్ష హిందురక్ష - మమ మంత్రః సమానతా" అనే నినాదంతో నేడు 35కు పైగా దేశాల్లో వేలాది మంది కార్యకర్తలు నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.సామాజిక సమరసత, మతాంతరీకరణల నిరోధం, పునరాగమన కార్యక్రమాలు, గోరక్ష, దేవాలయాల పరిరక్షణ. లవ్ జిహాద్ వంటి అకృత్యాల నుండి మహిళలను రక్షించడం, బాలబాలికలు,యువతలో దేశభక్తి, సంస్కారాలను పెంపొందించడం.గతంలో శ్రీరామజన్మభూమి విముక్తి, రామసేతు రక్షణ, ఏడుకొండల పరిరక్షణ, అమరనాథ్ భూముల రక్షణ ఉద్యమాలను విజయవంతంగా నిర్వహించిన పరిషత్.. ప్రస్తుతం దేవాలయాలను ప్రభుత్వ ఆధీనం నుండి విముక్తి చేసి ధర్మ పరిరక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది.ప్రతి మూడేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ 'హితచింతక్' (పరిషత్ పనికి మద్దతుదారులు) నమోదు అభియాన్ 2026 నవంబర్ 22 నుండి డిసెంబర్ 6 వరకు (16 రోజుల పాటు) కొనసాగుతుంది. 15 సంవత్సరాలు, ఆపై వయస్సు గల ప్రతి ఒక్కరూ కేవలం 20 రూపాయల రుసుముతో హితచింతక్గా నమోదు కావచ్చని, ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను ఇందులో భాగస్వా ములను చేయాలని నిర్వాహకులు పిలుపుని చ్చారు.ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ మండల కమిటీ సభ్యులు మల్లాది శ్రీనివాసరావు, అప్పికట్ల శ్రీనివాసరావు, మద్ది ఆనంద్, యాటగిరి శివయ్యలతో పాటు సంఘ పెద్దలు మద్దిరాత్రి నారాయణ, గోకినేని వెంకటరమణ, నేరెళ్ల హనుమంతురావు తదితరులు పాల్గొన్నారు
సూర్య నాయక్