BREAKING
ఓటు హక్కును హరించే కుట్రలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలిః సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా విశ్వహిందూ పరిషత్ ‘హితచింతక్’ సభ్యత్వ నమోదు పోలియో రహిత సమాజమే లక్ష్యం ప్రతి చిన్నారికి రెండు చుక్కలు తప్పనిసరి ఐకమత్యమే కాంగ్రెస్ విజయ రహస్యంః ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్ కుమార్ అక్రమంగా తరలిస్తున్న పశువుల రవాణా ముఠా అరెస్ట్ ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి బీఎం సందీప్ కుమార్‌కు ఘన స్వాగతం పార్టీ నూతన ఇన్‌చార్జ్ బీ.ఎం. సందీప్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వాకిటి ఈహెచ్ఎస్ మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన 200 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు.. 8 మందికి తదుపరి చికిత్సకు అనుమతులు ప్రజా సమస్యలపై కౌన్సిల్ లో గళం విప్పండి- కౌన్సిలర్లకు వేణు రెడ్డి పిలుపు బస్సులో ‘ఐ-అలర్ట్’ నిఘాః ఆర్టీసీ ఎండీ డాక్టర్ అనిల్ కుమార్ డాక్టర్ తారక్‌నాథ్‌తో పాటు 30 కుటుంబాలు జనసేనలో చేరిక ఫ్రేమ్ వర్క్ ఫర్టిలైజర్ సేల్ యాప్ పై అవగాహన వైసీపీకి షాక్ టీడీపీలో చేరిన ముఖ్య కుటుంబాలు. పెదమట్లపూడి సర్పంచి అభ్యర్థిగా లుక్కా గౌరీ కుమారి నామినేషన్ పరిగి, దోమ మండలాల్లో చిరుత కలకలం.. రైతుల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు

ఐకమత్యమే కాంగ్రెస్ విజయ రహస్యంః ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్ కుమార్

Select Suryaa Now
ఐకమత్యమే కాంగ్రెస్ విజయ రహస్యంః ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్ కుమార్

సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధిః  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేయడం వల్లే గత ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చిందని ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్ కుమార్ అన్నారు. గత ఎన్నికల్లో 64 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ పార్టీ విజయాలు సాధించిందని పేర్కొన్నారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ, రాష్ట్రంలో కరవు పరిస్థితులను అధిగమిస్తూ ప్రజలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు తగిన సహాయ సహకారాలు అందించడం లేదని విమర్శించారు. కేంద్రం సహాయ నిరాకరణ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అవసరాలను తీర్చేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తోందన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ మరిన్ని స్థానాలను గెలుచుకునేలా సమష్టిగా కృషి చేయాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన, పనితీరు దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని అన్నారు. గతంలో తెలంగాణలో ఏఐసీసీ ఇన్‌చార్జ్‌లుగా పనిచేసిన నాయకులు పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని గుర్తుచేశారు. వారి కృషిని కొనసాగిస్తూ, రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. సోనియా గాంధీ రచించిన 'బిలాంగింగ్' పుస్తకానికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత లభించిందని పేర్కొన్నారు. సోనియా గాంధీ చేసిన త్యాగాలు, మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల బలిదానాలు దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. నాయకులంతా విభేదాలను పక్కనపెట్టి ఐకమత్యంతో పనిచేస్తూ, రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని బి.ఎం. సందీప్ కుమార్ పిలుపునిచ్చారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.