ప్రజా సమస్యలపై కౌన్సిల్ లో గళం విప్పండి- కౌన్సిలర్లకు వేణు రెడ్డి పిలుపు
ప్రజా సమస్యలపై కౌన్సిల్ లో గళం విప్పండి- కౌన్సిలర్లకు వేణు రెడ్డి పిలుపు..
హిందూపురం టౌన్ మేజర్ న్యూస్:
హిందూపురంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన కౌన్సిలర్లతో స్థానిక పార్టీ కార్యాలయంలో గుడ్డుంపల్లి వేణు రెడ్డి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీ వార్డులలో ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడాలని, కౌన్సిల్ మీట్ సమావేశాలలో ప్రజల పక్షాన మీ గళం విప్పాలని, మీ వార్డులలో ఎదురైన సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా పనిచేయాలని నూతన కౌన్సిలర్లకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
నేటి దినపత్రిక సూర్య టౌన్ రిపోర్టర్ ఎం.నాగరాజు, హిందూపురం