గోనెగండ్ల జడ్పిటిసి బ్యాలెట్ కలకలం.. చెత్త కుప్పలో దొరికిన బ్యాలెట్లు
*ఎమ్మిగనూరు సూర్యప్రతినిధి.* ఇటీవల జరిగిన జడ్పిటిసి ఎన్నిక ల కౌంటింగ్ కేంద్రం వద్ద బ్యాలెట్ పత్రాలు ఎమ్మిగనూరు నియోజకవర్గం లో కలకలం రేపాయి.. గోనెగండ్ల జడ్పిటిసి కి సంబంధించిన బ్యాలెట్ పత్రాలు కౌంటింగ్ కేంద్రాల చెత్తబుట్టలో కనిపించడం విశేషం.. ఈనెల ఐదవ తేదీ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించారు. ఏడో తేదీ ఎనిమిదిన్నర ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో కౌంటింగ్ చేపట్టారు.. అయితే గోనెగండ్ల జడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ భరితంగా కొనసాగింది. కౌంటింగ్ సమయంలో కొద్ది క్షణాలు విద్యుత్ అంతరాయం కలిగించడంతో ఎన్నికల ఫలితాలపై విమర్శలు నాటి నుండి ఉన్నాయి. ఇందుకు నిదర్శనంగా 22వ తేదీ ఉదయం ఆదివారం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణ చెత్తకుప్పలో వైయస్సార్ అభ్యర్థి కి చెందిన ఫ్యాన్ గుర్తు పై ఓట్లు పడిన బ్యాలెట్ పత్రాలు 50 కట్ట కట్టినవి కనిపించాయి. ఈ సమాచారాన్ని తెలుసుకున్న ఎమ్మిగనూరు వైకాపా ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి అక్కడికి వెళ్లి పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చెత్తబుట్టలో ఉన్న బ్యాలెట్ పత్రాలను పరిశీలించిన ఆయన అన్ని ఓట్లు ఫ్యాన్ గుర్తుకు ఉండడంతో కూటమిపాటిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలింగ్ అధికారి కళ్ళు మూసుకున్నారు అంటూ విమర్శించారు. బ్యాలెట్ పత్రాలు చిన్నమరివీడు గ్రామానికి చెందినవిగా ఆయన వెల్లడించారు. ప్రతి బ్యాలెట్ పేపర్ పై పోలింగ్ అధికారి సంతకము. ఏ బూత్ కి సంబంధించిన ముద్ర కూడా అగుపిస్తుందన్నారు. ఇంత నిజానికి ఒడిగట్టిన కూటమి నాయకులు నీతులు వల్లించడం చూస్తుంటే సిగ్గుచేటు అనిపించదా అని ఆయన దువ్వబట్టారు. వైసిపి జెడ్పిటిసి అభ్యర్థి షేక్ జాంగిర్ గెలిచారనే ఇలాంటి కుట్రలు పన్నారని కూటమి నాయకులు సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కౌంటింగ్ సమయంలో విద్యుత్తును కావాలనే అంతరాయం కలిగించారని అనుమానాలు రేకెత్తుతున్నాయని ఈ బ్యాలెట్ పత్రాలను చూస్తూ న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. వైసీపీ అభ్యర్థి జహంగీర్ గెలిచాడని ఒప్పుకొని అక్కడ జడ్పిటిసిగా కొనసాగుతున్న తిరుపతయ్య నాయుడు తన పదవికి రాజీనామా చేస్తే బాగుంటుందని హితవు పలికారు.
కౌంటింగ్ కేంద్రం వద్ద ఫ్యాన్ గుర్తుకు పడిన ఓట్ల కట్టను చెత్తబుట్టలో పడేసి కూటమి నేతలు ఇలాంటి చెత్త రాజకీయాలు చేయడం.. తమ అభ్యర్థి ని గెలిపించామని సంకలు గుద్దుకోవడం కూటమి నాయకులకే చెల్లుతుందని ఆయన ధ్వజమెత్తారు.
ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి చేస్తున్న ఇలాంటి అబద్ధపు రాజకీయాలను ప్రజలు గమనించాలని ఆయన కోరారు.
A. R. శరత్ కుమార్, సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా