BREAKING
పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి : డీసీసీ ఉపాధ్యక్షుడు మహేష్ గౌడ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా శివకుమార్ నామినేషన్ జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ మెడ్‌వేవ్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం గోనెగండ్ల జడ్పిటిసి బ్యాలెట్ కలకలం.. చెత్త కుప్పలో దొరికిన బ్యాలెట్లు దక్షిణ కొరియాలో యలవర్తి హరిప్రసాద్ కు సీఈఓ క్లబ్ అవార్డు కూటమి బలపర్చిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపుతోనే గ్రామ అభివృద్ధి గుంతల ‘మయం’.. ప్రయాణం ‘భయం’ శుభ్రమైన రహదారులు, ట్రాఫిక్ జామ్‌లేని నగరం.. అగ్నివీరులకు శుభవార్త ఇవిగో ఆధారాలు... కౌశిక్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా..!? నిశ్చితార్థ వేడుకలో కాబోయే వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. ఒక్క నెలలోనే 16 బిలియన్ డాలర్ల భారం: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో తడిసిమోపెడైన భారత్ ముడిచమురు దిగుమతి బిల్లు! చమురు ధరల మంటకు మించిన పెను ముప్పు: ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం

దక్షిణ కొరియాలో యలవర్తి హరిప్రసాద్ కు సీఈఓ క్లబ్ అవార్డు

Select Suryaa Now
దక్షిణ కొరియాలో యలవర్తి హరిప్రసాద్ కు సీఈఓ క్లబ్ అవార్డు

 

 


స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలో విశిష్ట సేవలు అందిస్తూ వ్యాపార అభివృద్ధిలో ప్రతిభ కనబరిచిన పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ప్రముఖ ఇన్సూరెన్స్ సీనియర్ అడ్వైజర్ యలవర్తి హరిప్రసాద్ కు అరుదైన గౌరవం లభించింది.
దక్షిణ కొరియాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో స్టార్ హెల్త్ సీఈఓ మరియు ఎండీ ఆనంద్ రాయ్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక సీఈఓ క్లబ్ అవార్డును ఆయన అందుకున్నారు.
ఆరోగ్య బీమా రంగంలో విశేష కృషి చేస్తూ ప్రజలకు ఆరోగ్య బీమాపై అవగాహన కల్పించడంతో పాటు అనేక కుటుంబాలకు బీమా రక్షణ కల్పిస్తున్నందుకు ఆయనకు ఈ అవార్డు దక్కింది.
అంతర్జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు లభించడం పట్ల హరిప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు తనపై విశ్వాసం ఉంచిన ఖాతాదారులు, సంస్థ అధికారులు, సహచరులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల సహకారంతోనే సాధ్యమైందని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు.
సీనియర్ సేల్స్ మేనేజర్ లింగమల్లు శ్రీకాంత్ మరియు బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ సహకారంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. ఈ సందర్భంగా యలవర్తి హరిప్రసాద్ కు పిడుగురాళ్ల పట్టణ ప్రముఖులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఖాతాదారులు అభినందనలు తెలియజేశారు.వెంకట్ జర్నలిస్ట్ పిడుగురాళ్ల