నిశ్చితార్థ వేడుకలో కాబోయే వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే.
కళ్యాణదుర్గం: పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలబాబు సోదరుడి ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. పట్టణంలోని శ్రీ పద్మావతి గోవిందరాజుల కల్యాణ మండపంలో నిర్వహించిన సిరి చందన, సచిన్‌ల నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొని కాబోయే వధూవరులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో కలకాలం కలిసి జీవించాలని ఆకాంక్షించి ఆశీర్వదించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ఆప్యాయంగా ముచ్చటించి వేడుకలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు రాకతో వధూవరుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, స్థానిక ప్రముఖులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ := బోయ రంగస్వామి