పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి చిన్నారుల ఆరోగ్యమే సమాజ భవిష్యత్తు : శాపురం నర్సింహా రెడ్డి
పటాన్‌చెరు: పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించిన ముత్తంగి డివిజన్–265 సీఏంసీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు శాపురం నర్సింహా రెడ్డి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యమే సమాజ భవిష్యత్తు అని, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి ఆరోగ్య భద్రతకు తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. పోలియో నిర్మూలన కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని అన్నారు.పోలియో వంటి వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.