BREAKING
టీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు నాయకులు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి చిన్నారుల ఆరోగ్యమే సమాజ భవిష్యత్తు : శాపురం నర్సింహా రెడ్డి కార్యకర్తలకు అండగా ఉంటా.. ఆ ధైర్య పడవద్దు. తలారి రంగయ్య. జిల్లాస్థాయి 4 వ ర్యాంకింగ్ చెస్ పోటీలను ప్రారంభించిన నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ పి.జి.ఆర్.ఎస్ రద్దు : జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి పడమటి అనంత్ రెడ్డి సర్పంచ్ రాజస్థాన్‌లో భారీ రహదారి విస్తరణ: రూ. 800 కోట్లతో 62 కిలోమీటర్ల ఎన్‌హెచ్-148 మార్గాన్ని నాలుగు లేన్లుగా మార్చనున్న ఎన్‌హెచ్‌ఏఐ! 10 వేల మంది విద్యార్థులకు బ్లడ్ గ్రూపింగ్ ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు పనుల్లో కీలక మైలురాయి: 50 కి.మీ. సూరత్-బిలిమోరా మార్గానికి విద్యుత్ సరఫరా ప్రారంభం.. ట్రయల్ రన్స్‌కు ముమ్మర ఏర్పాట్లు! సనాతన ధర్మ పరిరక్షణే భారతీయ సంస్కృతికి పునాది – ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి ఎన్విడియాకు జెన్సెన్ హువాంగ్ విలువ నిజంగా 1 ట్రిలియన్ డాలర్లా?.. భారీ పతనం వెనుక మదుపర్లు గమనించాల్సిన అసలు నిజం ఇదే! రూ. 472 కోట్ల ఆదాయం నుండి ఏకంగా రూ. 3,456 కోట్ల ఏఐ బిల్లింగ్స్ దిశగా.. తప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకున్నా 29 ఏళ్లకే రూ. 1 కోటి సంపద.. యువ మదుపర్లకు 5 కీలక ఆర్థిక పాఠాలు! అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి షంషూర్‌ను గెలిపించండి

సనాతన ధర్మ పరిరక్షణే భారతీయ సంస్కృతికి పునాది – ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి

Select Suryaa Now
సనాతన ధర్మ పరిరక్షణే భారతీయ సంస్కృతికి పునాది – ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి

పటాన్ చెరు నియోజకవర్గం – బీరంగూడ: నియోజకవర్గంలోని అమీన్పూర్ మండలం బీరంగూడ డివిజన్ పరిధిలో బీరంగూడ గుట్టపై నూతనంగా నిర్మించిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ  చిన్నమైల్ అంజిరెడ్డి గారు, సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు  గోదావరి అంజిరెడ్డితో కలిసి బీరంగూడ డివిజన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్ పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్ను

ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి మాట్లాడుతూ:

"భారతదేశానికి సనాతన ధర్మం ఆధ్యాత్మిక శక్తి, మన సంస్కృతి మన సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శం. అయ్యప్ప స్వామి దీక్ష మనిషిలో క్రమశిక్షణ, నియమ నిష్ఠలు, సమానత్వ భావన, భక్తిభావాన్ని పెంపొందిస్తుంది. స్వామియే శరణమయ్యప్ప అనే నినాదం ప్రతి ఒక్కరిలో సేవాభావాన్ని, ఐక్యతను నింపుతుంది. దేవాలయాలు కేవలం ప్రార్థనా మందిరాలు మాత్రమే కాదు, మన సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి" అని పేర్కొన్నారు.

జిల్లా బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ:

"సనాతన ధర్మం స్త్రీలకు గౌరవం, సమాజానికి సమానత్వం, ప్రతి జీవికి ప్రేమను బోధించే గొప్ప జీవన విధానం. మన భవిష్యత్ తరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను అందించడం మనందరి బాధ్యత. దేవాలయాల అభివృద్ధి ద్వారా సమాజంలో భక్తిభావం, ఐక్యత, సేవా దృక్పథం మరింత బలపడతాయి. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

బీరంగూడ డివిజన్ బీజేపీ అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్ మాట్లాడుతూ:

"సనాతన ధర్మం అనేది కేవలం ఒక మత సంప్రదాయం కాదు.. అది మన జీవన విధానం, మన సంస్కృతి, మన భారతీయతకు ప్రతీక. ధర్మాన్ని కాపాడటం అంటే మన సంస్కృతిని, మన సంప్రదాయాలను, మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని భావితరాలకు అందించడం. అయ్యప్ప స్వామి దీక్ష మనకు కులమత భేదాలు లేకుండా అందరూ సమానమే అనే గొప్ప సందేశాన్ని ఇస్తుంది.బీరంగూడ గుట్టపై నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి దేవాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ పవిత్ర దేవాలయం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలని, ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో అయ్యప్ప స్వామి కరుణాకటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

‘ధర్మో రక్షతి రక్షితః – ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది.’

సనాతన ధర్మ పరిరక్షణ, దేవాలయాల అభివృద్ధి, భారతీయ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని" ఈర్ల రాజు ముదిరాజ్p పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కొండా లక్ష్మణ్, అమీన్పూర్ డివిజన్ అధ్యక్షులు కొత్తపల్లి రమేష్, నాయకులు ఎడ్ల జనార్దన్, శ్రవణ్ కుమార్, రఘు, మహిళా నాయకురాలు తులసి తదితరులు పాల్గొన్నారు.అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అయ్యప్ప స్వామి భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.స్వామియే శరణమయ్యప్ప!