అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి
సూర్య జగిత్యాల ప్రతినిధి:భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఏ ఒక్క కులానికో, వర్గానికో పరిమితమైన వ్యక్తి కాదని, దేశంలోని అన్ని కులాలు, మతాలు, వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన మహనీయుడని జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు గోపోజు రమేష్ బాబు అన్నారు.జ గిత్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన వారాంతపు నివాళి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా డిక్కీ కో ఆర్డినేటర్ నల్ల శ్యామ్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తూ, ఆయన ఆశయాలు, రాజ్యాంగ విలువలు, సమానత్వం, సామాజిక న్యాయంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు ఆఫ్ ఇండియా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు చిత్తారి ప్రభాకర్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు పొన్నగంటి రాజయ్య, గుడిసెల అశోక్ రాజు, పెగడపల్లి ఉప సర్పంచ్ బత్తుల ప్రదీప్, సుద్దాల జగదీష్, దళిత క్రిస్టియన్ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, డాడీ నల్ల సురేష్, రుద్ర మనోహర్, సంకె మహేష్, కాయితి శ్రీనివాస్, బొల్లం ప్రభాకర్, దాసరి ప్రవీణ్, దళిత సీనియర్ నాయకులు సుంకరపెల్లి అశోక్, గోసంగి తదితరులు పాల్గొన్నారు.