BREAKING
చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే సతీమణి పట్లోళ్ల అనుపమ రెడ్డి. నిండు జీవితానికి రెండు చుక్కలు.. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం గ్రామాభివృద్ధే లక్ష్యంగా రేఖ మంజునాథ్ ఇంటింటి ప్రచారం బీరంగూడ గుట్టపై ఆధ్యాత్మిక వైభవం.. అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం.. గండిగూడెం దుర్గమ్మ, ఎల్లమ్మ, చిత్తరమ్మ దేవాలయాల నిర్మాణాలకు ఎమ్మెల్యే భారీ విరాళం.. బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు మంచం గుర్తుతో ఆశా సుబ్రహ్మణ్యం ప్రచార శంఖారావం చిన్నారుల ఆరోగ్య రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి మైనారిటీలకు అండగా నిలుస్తూ పేద విద్యార్థిని, విద్యార్థులకు ఇంటి పెద్ద కొడుకులా ఆదుకుంటున్న వక్స్ బోర్డ్ డైరెక్టర్...... ఇస్మాయిల్ బేగ్ ఉచిత మెగా వైద్య శిబిరం చేరుకులపాడు సర్పంచ్ అభ్యర్థిగా శకుంతలమ్మ నామినేషన్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి. పల్స్ పోలియో - మన పిల్లల భవిష్యత్తుకు రక్షణ టెలికం బోర్డు మెంబర్ బీజేపీ జిల్లా నాయకులు బైండ్ల కుమార్ పేకాట స్థావరంపై పోలీసుల దాడి

గండిగూడెం దుర్గమ్మ, ఎల్లమ్మ, చిత్తరమ్మ దేవాలయాల నిర్మాణాలకు ఎమ్మెల్యే భారీ విరాళం..

Select Suryaa Now
గండిగూడెం దుర్గమ్మ, ఎల్లమ్మ, చిత్తరమ్మ దేవాలయాల నిర్మాణాలకు ఎమ్మెల్యే  భారీ విరాళం..

.అమీన్ పూర్ ;  అమీన్పూర్ డివిజన్ పరిధిలోని సుల్తాన్పూర్ గండిగూడెం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ, దుర్గమ్మ, చిత్తరమ్మ దేవాలయాల నిర్మాణాలకు ఎమ్మెల్యే  70 లక్షల రూపాయల సొంత నిధులు కేటాయించడంతోపాటు.. విగ్రహా ప్రతిష్టాపన, ఆలయ ప్రారంభోత్సవానికి 6 లక్షల రూపాయలు నిధులు అందజేశారు. ఆదివారం ఉదయం పటేల్ గూడ లోని మాజీ ఎంపీపీ దేవానంద్ నివాసంలో ఆలయ కమిటీ సభ్యులకు ఆరు లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. అనంతరం విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. దేవాలయాలు కేవలం ప్రార్థనా మందిరాలే కాకుండా ఆధ్యాత్మిక చింతనకు, భక్తిభావానికి, సామాజిక ఐక్యతకు కేంద్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో భక్తిభావం, ఆధ్యాత్మిక విలువలు పెంపొందించడంలో ఆలయాల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా సొంత నిధులతో 250కి పైగా దేవాలయాలు, చర్చిలు, మసీదులు, ఆశిర్ఖానాలు నిర్మించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరిలో భక్తి భావం పెంపొందించడమే లక్ష్యంగా వీటిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు ఆలయాల ప్రతిష్టాపన మహోత్సవాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు కృష్ణ, రాజు, భాస్కర్ గౌడ్, శ్రీకాంత్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.