పేకాట స్థావరంపై పోలీసుల దాడి
వెంకటగిరి మండలం వల్లివేడు గ్రామ పొలాల్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు ఆదివారం దాడి నిర్వహించారు.ఈ దాడిలో పేకాట ఆడుతున్న 6 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.6,580/- నగదునుస్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెంకటగిరి ఎస్ఐ తెలిపారు. గ్రామాల్లో పేకాట, జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.