జిల్లా యువజన ఉత్సవాల్లో సత్తా చాటిన ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు
జిల్లా యువజన ఉత్సవాల్లో సత్తా చాటిన ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు
ఐదు విభాగాల్లో 8 బహుమతులు – రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఏలూరు, మేజర్ న్యూస్: సెట్ వెల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా యువజన ఉత్సవాలు–2026 పోటీలు ఏలూరులోని సెయింట్ థెరిస్సా కళాశాలలో (St. Theresa's College) ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలలో ఏలూరు సత్రంపాడులోని ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ మొత్తం ఐదు విభాగాల్లో 8 బహుమతులు సాధించారు. అంతేకాకుండా విజేతలు రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న పోటీలకు ఎంపిక కావడం విశేషం.
బహుమతులు సాధించిన విద్యార్థుల వివరాలు:
1. జానపద నృత్యం (Folk Dance): గ్రూపు
- బి. సత్య – మొదటి సంవత్సరం బి.సి.ఏ – ద్వితీయ బహుమతి.
2. జానపద గీతం (Folk Song): గ్రూపు
సత్య బృందం – ద్వితీయ బహుమతి.
3. చిత్రలేఖనం (Painting):
- జి. దివ్యశ్రీ – రెండవ సంవత్సరం బి.సి.ఏ డేటా సైన్స్ – ప్రథమ బహుమతి.
- ధామని నాయక్ – రెండవ సంవత్సరం డేటా సైన్స్ – తృతీయ బహుమతి.
4. కవిత్వం (Poetry):
- చి. లక్ష్మీ భార్గవి – రెండవ సంవత్సరం బి.బి.ఏ – ద్వితీయ బహుమతి.
- బి. పెద్దయ్య – మొదటి సంవత్సరం బి.బి.ఏ – తృతీయ బహుమతి.
5. శాస్త్రీయ నృత్యం (Classical Dance):- కె. వర్షిణి – మొదటి సంవత్సరం – ద్వితీయ బహుమతి. ఎం.జోతిక – రెండవ సంవత్సరం డేటా సైన్స్ – తృతీయ బహుమతి. ఈ జిల్లా స్థాయి యువజన ఉత్సవాల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించడంతో పాటు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల ఆదిత్య డిగ్రీ కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. విజేతలందరినీ అభినందిస్తూ, రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా ప్రతిభ కనబరిచి కళాశాలకు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు.