BREAKING
ఇరాన్ అణు కార్యక్రమంపై డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన... జిల్లా యువజన ఉత్సవాల్లో సత్తా చాటిన ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు భారత ఐటీ రంగానికి ఏఐ ముప్పుపై ఆందోళనలు అనవసరం: పీపీఎఫ్ఏఎస్ సీఐఓ రాజీవ్ ఠక్కర్! వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించండి ఎస్‌సీఓ ఫోరమ్ చర్చలు: కాలువ ఆక్రమణ కళ్యాణమండపం నిర్మాణం క్యూ3 ఫలితాలపై అంచనాలు తగ్గించుకోవాలి :నిపుణుడు రాఘవేంద్ర నాథ్! రోడ్డుపై నిలిచిపోయిన భారీ వాహనంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి – మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడియా శ్రీదేవి రమేష్ వరికుంట సర్పంచ్‌గా ఇరగంరెడ్డి సునీత ఏకగ్రీవ ఎన్నిక నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం.. సియాంగ్ డ్యామ్ ప్రాజెక్టుపై ప్రజలతో చర్చలకు సిద్ధం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా! వారసత్వంగా వచ్చేది బాధ్యత మాత్రమే. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి ఈ వారం డివిడెండ్ స్టాక్స్ అలర్ట్: ఫ్యూజన్ సీఎక్స్, వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్, పశుపతి కాట్‌స్పిన్ షేర్లపై దృష్టి

కాలువ ఆక్రమణ కళ్యాణమండపం నిర్మాణం

Select Suryaa Now
కాలువ ఆక్రమణ కళ్యాణమండపం నిర్మాణం

పనసకోన కాలువను ఆక్రమించి కళ్యాణ మండపంపట్టించుకోని రెవెన్యూ అధికారులు.

తొట్టంబేడు మండలంలోని తొట్టంబేడు పంచాయతీ పరిధిలో ఈదులగుంట ఎల్ఐసి కాలనీ సమీపంలో పనసకోన కాలువను ఆక్రమించి కళ్యాణ మండపం నిర్మించిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.వివిధ రకాల రాజకీయ పార్టీలు మారుతూ తాను నాయకుడినని చెప్పుకునే వ్యక్తి ఏకంగా కాలువను ఆక్రమించి ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలువ ఆక్రమణకు గురవడంతో వర్షాకాలంలో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి చుట్టుపక్కల ప్రాంతాల్లో ముంపు ముప్పు పెరుగుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆక్రమణ జరిగిందని తెలిసినా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. కాలువను ఆక్రమించిన నిర్మాణాన్ని వెంటనే తొలగించి, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.అధికారులు స్పందించి కాలువ సర్వే చేయించి, ఆక్రమణలను తొలగించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి