BREAKING
ఎస్‌సీఓ ఫోరమ్ చర్చలు: కాలువ ఆక్రమణ కళ్యాణమండపం నిర్మాణం క్యూ3 ఫలితాలపై అంచనాలు తగ్గించుకోవాలి :నిపుణుడు రాఘవేంద్ర నాథ్! రోడ్డుపై నిలిచిపోయిన భారీ వాహనంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి – మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడియా శ్రీదేవి రమేష్ వరికుంట సర్పంచ్‌గా ఇరగంరెడ్డి సునీత ఏకగ్రీవ ఎన్నిక నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం.. సియాంగ్ డ్యామ్ ప్రాజెక్టుపై ప్రజలతో చర్చలకు సిద్ధం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా! వారసత్వంగా వచ్చేది బాధ్యత మాత్రమే. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి ఈ వారం డివిడెండ్ స్టాక్స్ అలర్ట్: ఫ్యూజన్ సీఎక్స్, వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్, పశుపతి కాట్‌స్పిన్ షేర్లపై దృష్టి దట్టమైన పొగమంచుతో ప్రయాణికులకు ఇబ్బందులు నవంబర్ 23-27 వారంలో కీలక కార్పొరేట్ యాక్షన్లు: జీ ఎంటర్‌టైన్‌మెంట్ బైబ్యాక్, రైట్స్ ఇష్యూలు, డివిడెండ్ స్టాక్స్ పూర్తి జాబితా క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 91 డాలర్లు భారత్‌కు ఎందుకు భారమో వివరించిన యూబీఎస్ ఇండియా రీసెర్చ్ హెడ్ గౌతమ్ ఛావోచారియా ఆటో డ్రైవర్ల కుమార్తెల వివాహాలకు రూ.5,016 చొప్పున అందజేత ప్రతి ఇంటికీ పరిచయమైన ముఖం.. ప్రతి మనసుకూ దగ్గరవుతున్న నాయకుడు :ప్రవీణ్ రెడ్డి

వారసత్వంగా వచ్చేది బాధ్యత మాత్రమే. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి

Select Suryaa Now
వారసత్వంగా వచ్చేది బాధ్యత మాత్రమే. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి

ఆళ్లగడ్డ మేజర్ న్యూస్; మాజీ పార్లమెంటు సభ్యులు కేంద్ర బిజెపి నాయకులు గంగుల ప్రతాపరెడ్డి తనయులు యువ నాయకులు గంగులఫణి  కృష్ణారెడ్డి మేజర్ న్యూస్ తో తన అభిప్రాయాన్ని తెలిపారు. ఆయన మాట్లాడుతూ

రాజకీయాల్లో పదవుల కంటే వ్యక్తిత్వం, ప్రజల నమ్మకమే ముఖ్యం భవిష్యత్తు తరాల కోసం ఆలోచించి.

వారసత్వంగా వచ్చేది బాధ్యత మాత్రమే!! నాయకత్వం ప్రజల విశ్వాసంతో సంపాదించుకోవాలి.

ఆళ్లగడ్డ రాజకీయాల్లో గంగుల కుటుంబం II ఒక చారిత్రక నేపథ్యం

ఆళ్లగడ్డ రాజకీయాల్లో గంగుల కుటుంబానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర, గుర్తింపు, ప్రజలతో

సుదీర్ఘమైన అనుబంధం ఉన్నాయి. మా కుటుంబంలోని పెద్దలు ప్రజాజీవితంలో ఎన్నో బాధ్యతలు నిర్వహించారు. మా నాన్న గంగుల ప్రతాప్ రెడ్డిఎమ్మెల్యేగా, లోకసభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు సేవలందించారు. ఆ రాజకీయ వారసత్వం, ప్రజలతో మా కుటుంబానికి ఉన్న అనుబంధం మాకు గర్వకారణం. అయితే

గతంలో ఉన్న పరిస్థితులు ఈరోజు అలాగే ఉంటాయని అనుకోవడం సరైంది కాదు

కాలం మారింది, రాజకీయాల స్వరూపం మారింది, ప్రజల అంచనాలు కూడా మారాయి. గత వైభవాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని భవిష్యత్తును నిర్మించలేము. ప్రజల నమ్మకాన్ని మళ్లీ సంపాదించుకోవాలంటే ప్రస్తుత అవసరాలను అర్థం చేసుకుని, కొత్త ఆలోచనలతో, బాధ్యతితో పనిచేయాలి.

తన తండ్రి గంగుల ప్రతాప్ రెడ్డి , తాను రాజకీయాల విషయంలో ఒక ముఖ్యమైన ఆలోచనను పంచుకుంటామని గంగుల ఫణి కృష్ణారెడ్డి తెలిపారు, రాజకీయాలు ఒకప్పుడు ఉన్నట్లుగా చేతులు మారీ ఆస్తి కావని, వారసత్వంగా వచ్చేది బాధ్యత మాత్రమేనని, నాయకత్వం మాత్రం ప్రజల విశ్వాసం, మన పనితీరు, అర్హత, నిబద్ధత ద్వారా సంపాదించుకోవాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డాడు..

2009 తర్వాత రాజకీయ ప్రయాణం కుటుంబ గౌరవానికి

ప్రాధాన్యత

2009 తర్వాత తన రాజకీయ ప్రయాణంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని గంగుల ఫణికృష్ణారెడ్డి తెలిపారు. రాజకీయ పరిస్థితులు ఒక కారణమైతే, కుటుంబపరమైన బాధ్యతలు వద్దల పట్ల గౌరవం, సమిష్టి కుటుంబ నిర్ణయాలకు విలువ ఇవ్వాల్సిన సందర్భాలు కూడా మరో ముఖ్యమైన కారణమని పేర్కొన్నాడు. కొన్ని సందర్భాల్లో తన వ్యక్తిగత రాజకీయ ఆకాంక్షల కంటే కుటుంబ ఐక్యతకు, పెద్దల

నిర్ణయాలకు, కుటుంబ గౌరవానికి ప్రాధాన్యత ఇచ్చి వెనక్కి తగ్గడం జరిగిందన్నారు.

రాజకీయంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నప్పటికీ, కుటుంబంలో ఐక్యత, పరస్పర గౌరవం దెబ్బతినకూడదనే ఉద్దేశంలో కొన్ని విషయాల్లో సంయమనం పాటించానని తెలిపారు. దానివల్ల రాజకీయంగా కొన్ని అవకాశాలు కోల్పోయి ఉండవచ్చని అంగీకరిస్తూనే, కుటుంబ బంధాలు, పెద్దల పట్ల గౌరవం తనకు ఎప్పుడూ ముఖ్యమని స్పష్టం చేశారు. రాజకీయాల పట్ల తన ఆసక్తి లేదా ప్రజలకు ఏదైనా చేయాలనే ఆలోచన మాత్రం ఎప్పుడూ తగ్గలేదని అన్నారు.

| రాజకీయాలకు దూరమైనా ప్రజలకు దూరం కాలేదు

రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉన్నంత మాత్రాన ఆళ్లగడ్డ ప్రజలతో తన అనుబంధం తగ్గలేదని ఫణికృష్ణారెడ్డి పేర్కొన్నారు. తమ కుటుంబాన్ని అభిమానించిన ప్రజలు, తమ వెంట నడిచిన కార్యకర్తలు, కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరి అభిమానాన్ని తాము ఎప్పటికీ మర్చిపోలేమని తెలిపారు.

తన కుటుంబాన్ని నమ్ముకుని పరిచేసిన కార్యకర్తలకు వారు ఆశించిన స్థాయిలో

అందుబాటులో ఉండలేకపోయిన సందర్భాలు ఉన్నాయని, అందుకు తనకు బాధ ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరికీ వారు ఆశించిన స్థాయిలో రాజకీయ ప్రాధాన్యత, అవకాశాలు కల్పించగలిగామని వెప్పలేనిని నిజాయితీగా అంగీకరించారు. రాజకీయాల్లో సదవులు, అవకాశాలు తాత్కాలికమైనవని, కానీ మన కోసం నిలబడిన మనుషులతో ఉన్న అనుబంధం, నమ్మకం ఎంతో విలువైనవని అన్నారు..

గతంలో తమకు దూరమైన కార్యకర్తలు, అభిమానులు తిరిగి కలవాలనుకుంటే వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తానని తెలిపారు. రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు సహజమని, వ్యక్తిగత అనుబంధాలు మాత్రం వాటికి అతీతంగా ఉండాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఆళ్లగడ్డ ప్రజలు, కార్యకర్తలతో మళ్లీ మరింత దగ్గరగా మమేకమయ్యే ఆలోచన తనకు ఉందని, వారి అభిప్రాయాలు, ఆకాంక్షలు తెలుసుకోవడం ముఖ్యమని

పేర్కొన్నారు.

| వారసత్వం కాదు || స్వీయ అర్హతతో నాయకత్వం

రాజకీయ కుటుంబంలో జన్మించినంత మాత్రాన ప్రజలు తనను నాయకుడిగా అంగీకరించాలని తాను కోరుకోవడం లేదని ఫణికృష్ణారెడ్డి స్పష్టం చేశారు. 5న తండ్రి

సంపాదించుకున్న గౌరవం, గుర్తింపు తమ కుటుంబానికి గర్వకారణమే అయినప్పటికీ, దానిని తన వ్యక్తిగత అర్హతగా చూపించుకోవాలనుకోవడం లేదన్నారు. ఒక రాజకీయ కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా కాకుండా, తన సొంత ఆలోచనలు, జ్ఞానం, అనుభవం, పనితీరు ప్రజల పట్ల నిబద్దత ఆధారంగా గుర్తింపు సంపాదించుకోవాలనేదే తన అభిమతమని తెలిపారు.

వారసత్వాన్ని గౌరవించాలి, కానీ వారసత్వం హక్కును కాదు బాధ్యతను గుర్తు చేయాలని తాను నమ్ముకున్నట్లు చెప్పారు. తాను 'నెపో కిడ్'గా గుర్తింపు పొందాలని కోరుకోవడం లేదని, ముందుగా నేర్చుకుని, సమాజాన్ని అర్థం చేసుకుని, తగిన అనుభవం, పరిజ్ఞానం సంపాదించుకుని, ఆ తర్వాతే నాయకత్వ బాధ్యత గురించి ఆలోవించాలనుకున్నానని వివరించారు.

నాయకత్వం వహించాలంటే ముందుగా నేర్చుకోవాలి. ప్రజల సమస్యలను అర్థం చేసుకోవాలి. వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. అభివృద్ధికి అడ్డంకులు ఏమిటి అవకాశాలు ఎక్కడ ఉన్నాయి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాలపై అవగాహన పెంచుకోవాలి. తగిన జ్ఞానం, అనుభవం సంపాదించిన తర్వాతే ఇతరులకు దిశానిర్దేశం చేయగలమని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపాడు.

రాజకీయాలు డబ్బు కోసం కాదు – ప్రజాసేవ కోసం

రాజకీయాలు డబ్బు సంపాదించడానికి మార్గం కాకూడదని, ప్రజలకు ఉపయోగపడే బాధ్యతగా ఉండాలని పణికృష్ణారెడ్డి అన్నారు. అధికారం, పదవులు శాశ్వతం కావని, ప్రజల విశ్వాసాన్ని సంపాదించి నిలబెట్టుకోవడమే నిజమైన నాయకత్వానికి కొలమానమని

అభిప్రాయపడ్డాడు. రాజకీయాల్లోకి వచ్చి ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదని, మన వల్ల సమాబానికి ఎంత ఉపయోగం ఐరిగింది, ఎంతమంది జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురాగలిగామన్నదే ముఖ్యమని చెప్పారు.

ప్రజా జీవతంలో నిజాయితీ, పారదర్శకత, బాధ్యతాయుతమైన వ్యవహారం అత్యంత ముఖ్యమని, ప్రజల నమ్మకాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎప్పుడూ ఉపయోగించకూడదని తెలిపారు. పదవి అనేది ప్రజలు ఇచ్చే బాధ్యత మాత్రమేనని, దానిని ప్రజల సంక్షేమం కోసం వినియోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

భవిష్యత్తు తరాలే అభివృద్ధికి కేంద్రబిందువు

తన ఆలోచనల్లో భవిష్యత్తు తరాలకు అత్యంత ప్రాధాన్యత ఉందని ఫణికృష్ణా రెడ్డి

తెలిపారు. ఈరోజు తీసుకునే నిర్ణయాలు రాబోయే 20030 సంవత్సరాల్లో మన ప్రాంతం, మన పిల్లలు, మన యువతి జీవన ప్రమాణాలను ప్రభావితం చేస్తాయని అన్నారు. అందువల్ల తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కంటే దీర్ఘకాలిక అభివృద్ధికి

ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.

రైతుల సంక్షేమం, యువతకు నైపుణ్యాలు మరియు ఉపాధి అవకాశాలు నాణ్యమైన విద్య, ప్రాంతీయ మౌలిక సదుపాయాలు, నీటి భద్రత, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల వంటి అంశాలపై ఆచరణాత్మకంగా ఆలోచించి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి అనేది కేవలం ప్రకటనలు లేదా హామీలలో సాధ్యంకాదని, స్థానిక

అవసరాలను అర్థం చేసుకుని. అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా

వినియోగించి, ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగాలని చెప్పారు.

పూర్తిగా వెల్లడించదలుచుకోలేదని, సరైన సమయంలో ప్రజల ముందుకు భవిష్యత్తులో చేపట్టదలచిన కార్యక్రమాలు, కార్యాచరణ, ఆలోచనల వివరాలను ఇప్పుడే తీసుకువస్తానని తెలిపారు. ముందుగా పని ప్రారంభించి, దాని ఫలిజాలే మాట్లాడాలని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు.

కొత్త తరం నాయకత్వానికి అవకాశం

భవిష్యత్తు నాయకత్వం కొత్త ఆలోచనలు, కొత్త శక్తి బాధ్యతాయుతమైన దృక్పథంతో ముందుకు రావాలని వెణి కృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. యువతకు కేవలం రాజకీయాల్లో స్థానం కల్పించడం మాత్రమే కాకుండా, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో వారికి బాధ్యత, అవకాశం, ప్రోత్సాహం ఇవ్వాలని అన్నారు. నాయకత్వం అనేది ఒక్క వ్యక్తి చుట్టూ తిరగకూడదని, సమర్థులైన వ్యక్తులను గుర్తించి, వారికి ఎదిగే అవకాశం కల్పించి.

బృందంగా పనిచేసే సంస్కృతి అవసరమని పేర్కొన్నారు.

తన దృష్టిలో నాయకత్వం అంటే ఈరోజు సమస్యలకు పరిష్కారం చూపడమే కాదు: రాబోయే తరాలకు బలమైన పునాది వేయడం, వారు మనకంటే మెరుగైన అవకాశాలతో ముందుకు వెళ్లే పరిస్థితులు సృష్టించడం కూడా అని తెలిపారు.

నా రాజకీయ భవిష్యత్తును ప్రజలే నిర్ణయించాలి

గంగుల కుటుంబం మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుందా, తాను భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేస్తారా, 2029 ఎన్నికల్లో తన పాత్ర ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ నిర్ణయం కేవలం తన వ్యక్తిగత ఆకాంక్షపై ఆధారపడకూడదని ఫణికృష్ణారెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షలు, వారి విశ్వాసం, వారి అభిప్రాయం కూడా ఇందులో అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు.

తాను నాయకత్వం వహించడానికి అర్హుడినా కాదా అన్నది తానే ప్రకటించుకోవడం

సరైంది కాదని, తన ఆలోచనలు, సామర్థ్యం, పనితీరు, నిబద్ధతను పరిశీలించి ప్రజలే నిర్ణయించాలని అన్నారు. 'నేను మీకు నాయకత్వం వహించగలనని, మీ ఆశలు, అవసరాలకు అనుగుణంగా పనిచేయగలనని మీరు భావిస్తేనే ఆ అవకాశం ఇవ్వండి. ప్రజలపై నా ఆకాంక్షను రుద్దడం నా ఉద్దేశం కాదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయగల వ్యక్తిగా ఎదగాలన్నదే నా లక్ష్యం' అని పేర్కొన్నారు.

ప్రజలు తనకు ఆ బాధ్యత ఇవ్వాలని భావిస్తే దానికి తగిన అర్హత, సన్నద్ధతిలో ఉండేందుకు కృషి చేస్తానని, ప్రజల నిర్ణయం ఏదైనా గౌరవిస్తానని తెలిపారు. ప్రస్తుతానికి తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై ముందస్తు ప్రకటన చేయదలుచుకోలేదని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని వెప్పారు.

పార్టీలు, రాజకీయ పరిస్థితులపై నా వైఖరి

రాజకీయాల్లో పార్టీలు, పరిస్థితులు, సమీకరణాలు మారుతూ ఉంటాయని ఫణికృష్ణారెడ్డి అన్నారు. జాను ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో ఉన్నాననే అంశం కంటే, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ ఆలోచనతో, ఏ నిబద్ధతతో పనిచేయగలమన్నదే తనకు

ముఖ్యమని తెలిపారు. గతంలో చోటు వేసుకున్న రాజకీయ పరిణామాలను వ్యక్తిగత విమర్శలుగా మార్చుకోవడం తన ఉద్దేశం కాదని, ఎవరినీ నిందిస్తూ ముందుకు వెళ్లాలనుకోవడం లేదని చెప్పారు.

రాజకీయాల్లో నమ్మడం, పరస్పర గౌరవం, మాట నిలబెట్టుకోవడం ముఖ్యమని, గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగడమే తన విధానమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆళ్లగడ్డలో ఉన్న రాజకీయ నాయకత్వంపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకుండా, ప్రజలకు ఎవరు మెరుగైన సేవ అందించగలరన్నది వారి పనితీరు ఆధారంగా ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.

వ్యక్తిత్వం, ప్రజల నమ్మకమే జీవితకాల సంపద

తన కుటుంబం నుండి, పెద్దల నుంచి నేర్చుకున్న ఒక ముఖ్యమైన విలువను ఫణి కృష్ణారెడ్డి ప్రస్తావించారు. జీవితంలో సంపదను కోల్పోవచ్చు. పదవులను కోల్పోవచ్చు. అవకాశాలను కోల్పోవచ్చు. వాటిని మళ్లీ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కానీ వ్యక్తిత్వాన్ని, మనుషుల నమ్మకాన్ని ఒకసారి కోల్పోతే తిరిగి

సంపాదించడం చాలా కష్టమని అన్నారు.

'మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏ కుటుంబంలో పుట్టాం అన్నది మనకు ఒక బాధ్యతను గుర్తు చేయాలి. జీవితంలో ఏదైనా కోల్పోవచ్చు, కానీ మన స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని మనుషుల నమ్మకాన్ని కోల్పోకూడదు. డబ్బును మళ్లీ సంపాదించవచ్చు, పదవిని మళ్లీ పొందవచ్చు. కానీ ఒకసారి కోల్పోయిన వ్యక్తిత్వాన్ని, ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందడం.

చాలా కష్టం అని పేర్కొన్నారు.

తనకు రాజకీయాల్లో పదవులు లేదా వ్యక్తిగత లాభాల కంటే ప్రజలతో ఉన్న అనుబంధం, వారి విశ్వాసం, సమాజానికి ఉపయోగపడే పని ముఖ్యమని తెలిపారు. గతం తమ కుటుంబం సంపాదించుకున్నదవి, భవిష్యత్తును మాత్రం తన పనితో, ఆలోచనలతో, ప్రజల విశ్వాసంతో సంపాదించుకోవాలనుకుంటున్నానని అన్నారు.

ప్రజలకు నా విజ్ఞప్తి ఆళ్లగడ్డ ప్రజలు, తమ కుటుంబాన్ని అభిమానించిన ప్రతి ఒక్కరికీ ఫణికృష్ణారెడ్డి

కృతజ్ఞతలు తెలిపారు. కొంతకాలం ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించకపోయినా ప్రజల అభిమానాన్ని, కార్యకర్తల త్యాగాలను మర్చిపోలేదని చెప్పారు. తనను ఒక కుటుంబ వారసుడిగా మాత్రమే కాకుండా, తన ఆలోచనలు, పనితీరు, సామర్థ్యం, ప్రజల పట్ల నిబద్ధత ఆధారంగా అంచనా వేయాలని కోరారు.

నేను నాయకత్వం వహించాలా వద్దా అన్నది నేను ఒక్కడినే నిర్ణయించుకోకూడదు. ఆ హక్కు ప్రజలది. నా ఆలోచనలు, నా సామర్థ్యం, నా నిబద్ధతను చూసి నేను మీకు నాయకత్వం వహించగలనని మీరు భావిస్తేనే అవకాశం ఇవ్వండి. మీ తీర్పు ఏదైనా

గౌరవంగా స్వీకరిస్తాను. ప్రజలపై నా ఆకాంక్షను రుద్దడం కాదు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయగల వ్యక్తిగా ఎదగడమే నా లక్ష్యం' అని గంగుల ఫణికృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

ప్రజల ఆశీస్సులు, ఆదరణ తనకు ఎప్పటికీ ముఖ్యమని, ఆళ్లగడ్డ ప్రజలతో తన అనుబంధం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.

శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా