BREAKING
నవంబర్ 23-27 వారంలో కీలక కార్పొరేట్ యాక్షన్లు: జీ ఎంటర్‌టైన్‌మెంట్ బైబ్యాక్, రైట్స్ ఇష్యూలు, డివిడెండ్ స్టాక్స్ పూర్తి జాబితా క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 91 డాలర్లు భారత్‌కు ఎందుకు భారమో వివరించిన యూబీఎస్ ఇండియా రీసెర్చ్ హెడ్ గౌతమ్ ఛావోచారియా ఆటో డ్రైవర్ల కుమార్తెల వివాహాలకు రూ.5,016 చొప్పున అందజేత ప్రతి ఇంటికీ పరిచయమైన ముఖం.. ప్రతి మనసుకూ దగ్గరవుతున్న నాయకుడు :ప్రవీణ్ రెడ్డి యాదవుల ఐక్యతకు సదర్ సమ్మేళనం వేదిక ‎నిన్నే రూపముగా సేవించాలో శివయ్యా.… ‎(ఆథ్యాత్మిక వ్యాసం..) సిరిసిల్ల రెండో బైపాస్‌లో ఆర్టీసీ బస్సు-కారు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు! 107 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల భరోసా బైరెడ్డిపల్లి మండలంలో 21సర్పంచ్ స్థానాలకు 46 మంది పోటీ, 172వార్డులకు 144 మంది పోటీ భారత్ భారీ స్కోర్.. న్యూజిలాండ్‌పై 352 పరుగుల ఆధిక్యం రాచానుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైసిపి బలపరిచిన బండ అంజి యాదవ్ ఎన్నికల ప్రచారానికి అపూర్వ ఆదరణ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే అమిలినేనికి ఆహ్వానం తిరుమల శ్రీవారి దర్శనం: 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు.. 10వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు పొగమంచు పట్ల అప్రమత్తంగా ఉండండి,రోడ్డు ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించండి: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర

ప్రతి ఇంటికీ పరిచయమైన ముఖం.. ప్రతి మనసుకూ దగ్గరవుతున్న నాయకుడు :ప్రవీణ్ రెడ్డి

Select Suryaa Now
ప్రతి ఇంటికీ పరిచయమైన ముఖం.. ప్రతి మనసుకూ దగ్గరవుతున్న నాయకుడు :ప్రవీణ్ రెడ్డి

పరిగి మేజర్ న్యూస్ | కోడిగెనహళ్లి:

రాజకీయాల్లో పదవులు రావచ్చు.. అవకాశాలు కలిసిరావచ్చు.. కానీ ప్రజలతో మంచి అనుబంధాన్ని సంపాదించుకోవడం మాత్రం నిరంతర కృషితోనే సాధ్యం. అలాంటి ఆత్మీయతనే తన ప్రచారంలో చూపిస్తున్నారు కోడిగెనహళ్లి టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి.తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చిన ప్రవీణ్ రెడ్డికి పార్టీ నాయకత్వం సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని బాధ్యతగా స్వీకరించిన ఆయన గ్రామంలో ప్రజలను నేరుగా కలుస్తూ ప్రచారానికి శ్రీకారం చుట్టారు.ప్రచారంలో భాగంగా గ్రామంలోని ప్రతి వీధిలో పర్యటిస్తూ పెద్దలను పలకరిస్తున్నారు. వారి ఆశీస్సులు తీసుకుంటూ యువతతో మమేకమవుతూ ఆత్మీయంగా ముందుకు సాగుతున్నారు. తన రాజకీయ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుంటూనే, ఇప్పుడు గ్రామ ప్రజల మద్దతు కోరుతున్నారు.పార్టీ కోసం పనిచేసిన రోజులు ఒక ఎత్తయితే.. ఇప్పుడు ప్రజల నమ్మకాన్ని సంపాదించుకోవడం మరో బాధ్యతగా ప్రవీణ్ రెడ్డి భావిస్తున్నారు. తనను కేవలం ఎన్నికల అభ్యర్థిగా కాకుండా, గ్రామంలో అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా చూడాలని కోరుతున్నారు.పార్టీ నాకు ఇచ్చిన అవకాశాన్ని గౌరవంగా భావిస్తున్నాను. కోడిగెనహళ్లి ప్రజల ఆదరణ, పెద్దల ఆశీస్సులు నాకు ఎంతో ముఖ్యం. మీలో ఒకరిగా ఉంటూ మీ నమ్మకానికి తగిన విధంగా పనిచేయాలన్నదే నా ఆకాంక్ష అని ప్రవీణ్ రెడ్డి పేర్కొన్నారు. 

 పరిగి సూర్య రిపోర్టర్ నవీన్..