ఆటో డ్రైవర్ల కుమార్తెల వివాహాలకు రూ.5,016 చొప్పున అందజేత
సూర్య కరీంనగర్: కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోని ఆటో డ్రైవర్ల కుమార్తెల వివాహాలకు రూ.5,016 చొప్పున కానుక అందజేస్తానని ఇచ్చిన మాట ప్రకారం నారదాసు వసంతరావు మరోసారి తన హామీని నిలబెట్టుకున్నారు. కోర్టు ఎదుట రెడ్డి రెసిడెన్సీ (అంబేద్కర్ ఆటో స్టాండ్) సభ్యుడు నాగం హనుమంతు కుమార్తె వివాహానికి, బస్టాండ్ ఎదుట దుర్గాభవాని ఆటో స్టాండ్ సభ్యుడు జేరిపోతుల తిరుపతి కుమార్తె వివాహానికి రూ.5,016 చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమం సంఘం అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఆటో కార్మికుల కుటుంబాలకు అండగా నిలుస్తూ ఐదవ, ఆరవసారి తన మాట నిలబెట్టుకున్న నారదాసు వసంతరావుకు సంఘం సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బండారి సంపత్ పటేల్, కొత్తూరు సత్యనారాయణ, కుకట్ల సంపత్, మీర్జా అఫ్జల్ బేగ్, కూర్మాచలం వేణుమాధవ్ తదితర కార్యవర్గ సభ్యులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.