ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకూడదు - పోలియో రహిత సమాజమే లక్ష్యం
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్…
బస్ స్టాండ్ లో ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు…
ఫరూక నగర్ రంగారెడ్డి :
షాద్‌నగర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిర్వహించిన ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలి. ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకూడదు అని పిలుపునిచ్చారు..
ప్రతి చిన్నారి ఆరోగ్యంగా, ఆనందంగా ఎదగాలంటే చిన్నతనం నుంచే తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. పోలియో చుక్కలు వేయించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దు"* అని తల్లిదండ్రులకు సూచించారు.
పోలియో వ్యాధి నుంచి చిన్నారులను రక్షించేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మాజీ జడ్పీటీసీ వెంకట్ రాం రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నల్లమోని శ్రీధర్ ముదిరాజ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్, కౌన్సిలర్ సి. పెంటయ్య, కళ్యాణకర్ దిలీప్, శివ, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఖదీర్, సుజీవన్, నేతలు చందు లాల్, ముబారక్ అలీ ఖాన్, ఇబ్రహీం, కత్తి చంద్రశేఖర అప్ప, నాగమణి, మధువలు యాదవ్, తంగడపల్లి శంకర్, గుడిపల్లి బీరప్ప, మంగ అశోక్, రవితేజ, జయప్రకాష్, ఎస్సీ సెల్ నియోజకవర్గం కన్వీనర్ జాంగారి రవి, వెలిజర్ల గ్రామ సర్పంచ్ బాబు నాయక్, కరుణాకర్, నెహ్రు నాయక్, జంగయ్య, రమేష్, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.