BREAKING
నేటి పంచాంగం23 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు23 నవంబర్, 2026 కేశినేని చిన్ని ఆధ్వర్యంలో మేయర్, కార్పొరేటర్లకు ఘన సత్కారం వైభవంగా శ్రీపంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం సర్పంచ్లకు 13, వార్డులకు 133 నామినేషన్లు జడ్పీటీసీ ఉదయ్ కుమార్ పూజలు చిన్నారి రుతిక వైద్యానికి రూ.2,20,503 విరాళం జగ్గయ్యపేటలో విజయవంతంగా సేవలందిస్తున్న బొజ్జా డెంటల్ సాంప్రదాయంగా తులసి దామోదర కళ్యాణం ఘనంగా యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా .. 5వ కౌన్సిల్ సమావేశాలు ఆప్యాయ పలకరింపులతో ఓటర్లను ఆకట్టుకుంటున్న మోదుగుముడి వెంకటేశ్వరరావు. నేడు మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం గూడవల్లి సర్పంచ్‌గా నెరుసు నీల మణిఈశ్వరరావు (నిఖిల్) ఏకగ్రీవ ఎన్నిక.. తాడిగడప 13వ వార్డులో బోడే ప్రసాద్ ఎన్నికల ప్రచారం అవనిగడ్డ మండలంలో రెండో రోజు కోలాహలంగా నామినేషన్లు

గో సంరక్షణలో సరికొత్త అధ్యాయం -దేశీయ గో సంపద పరిరక్షణలో సంచలన విజయం -56 ఐవీఎఫ్ సాహివాల్ దూడలు ఉత్పత్తి.. దేశంలోనే అరుదైన ఘనత దేశీయ ఆవుల జన్యు విప్లవం...వెటర్నరీ వర్సిటీ శాస్త్రవేత్తల అద్భుతం -తిరుపతి వెటర్నరీ వర్సిటీ సంచలన విజయం -వెటర్నరీ - టిటిడి సంయుక్త ప్రాజెక్టుతో సాధ్యం : కేంద్ర మంత్రి ప్రశంసల

Select Suryaa Now
గో సంరక్షణలో సరికొత్త అధ్యాయం -దేశీయ గో సంపద పరిరక్షణలో సంచలన విజయం -56 ఐవీఎఫ్ సాహివాల్ దూడలు ఉత్పత్తి.. దేశంలోనే అరుదైన ఘనత దేశీయ ఆవుల జన్యు విప్లవం...వెటర్నరీ వర్సిటీ శాస్త్రవేత్తల అద్భుతం  -తిరుపతి వెటర్నరీ వర్సిటీ సంచలన విజయం -వెటర్నరీ - టిటిడి సంయుక్త ప్రాజెక్టుతో సాధ్యం : కేంద్ర మంత్రి ప్రశంసల

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : దేశీయ గో సంపద పరిరక్షణ, జన్యు అభివృద్ధిలో తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం దేశంలోనే అరుదైన ఘనతను సాధించింది. వెటర్నరీ పశువైద్య విశ్వవిద్యాలయం - తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త ప్రాజెక్టు ద్వారా అత్యాధునిక ఐవీఎఫ్ సాంకేతికతతో ఏకంగా 56 సాహివాల్ దూడలను విజయవంతంగా ఉత్పత్తి చేశారు. దేశీయ పాడి జాతుల పరిరక్షణలో ఇది ఒక చారిత్రక మైలురాయిగా నిలిచింది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమల మంత్రిత్వ శాఖ, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖల సహాయ మంత్రి ఎస్.పి. సింగ్ బఘేల్, లోక్‌సభ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, కేంద్ర పశుసంవర్ధక పాడిపరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి వర్షా జోషి పర్యటనలో భాగంగా ఈ విజయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, విశ్వవిద్యాలయాన్ని అభినందించారు.

దేశీయ జాతులే లక్ష్యం…

ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ డాక్టర్ వి. వైకుంఠ రావు మాట్లాడుతూ దేశీయ పశుసంపద వనరులైన ఆవులు, గేదెలు మరియు గొర్రెల పరిరక్షణ, వ్యాప్తి, జన్యుపరమైన అభివృద్ధికి విశ్వవిద్యాలయం చేపడుతున్న కృషిని వివరించారు. శాస్త్రీయ పద్ధతుల ద్వారా దేశీయ పశుసంపద జన్యు పదార్థాన్ని బలోపేతం చేయడం, సుస్థిర పశు ఉత్పాదకతను పెంచడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. దీని కోసం చేపట్టిన పరిశోధన కార్యక్రమాలు, సంస్థాగత సౌకర్యాలు, శాస్త్రవేత్తల నిబద్ధతను ప్రముఖంగా ప్రస్తావించారు.టీటీడీ ఆర్థిక సహాయంతో అమలు చేసిన “పశువులలో సహాయక పునరుత్పత్తి సాంకేతికతల ద్వారా ఉత్పాదకత పెంపుకు వర్సిటీ-టీటీడీ ప్రాజెక్ట్ ప్రధాన పరిశోధకుడు డాక్టర్ కె.వీర బ్రహ్మయ్య ప్రాజెక్టు విజయాలను వివరించారు.

56 ఐవీఎఫ్ సాహివాల్ దూడలు ఉత్పత్తి

జన్యుపరంగా శ్రేష్ఠమైన సాహివాల్ పశువుల వేగవంతమైన వృద్ధి కోసం ఓవమ్ పిక్-అప్ ఇన్ విట్రో మెచ్యూరేషన్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించినట్లు తెలిపారు. ఈ సాంకేతికత ద్వారా 56 సాహివాల్ దూడలను విజయవంతంగా ఉత్పత్తి చేయడం ఈ ముఖ్యమైన దేశీయ పాడి జాతి పరిరక్షణ మరియు వృద్ధిలో గణనీయమైన విజయమని పేర్కొన్నారు.

ఐవిఎం మీడియా అభివృద్ధితో ప్రయోగశాల పురోగతి

ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్, వికసిత్ భారత్ @2047 దార్శనికతకు అనుగుణంగా, ఖరీదైన దిగుమతి వినియోగ వస్తువులు హార్మోన్ల తయారీలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ, స్వదేశీ, తక్కువ ఖర్చుతో కూడిన ఐవీఎం మీడియాను అభివృద్ధి చేయడంలో కూడా ఈ ప్రయోగశాల పురోగతి సాధించింది. దీంతో సామాన్య రైతుకు కూడా ఈ సాంకేతికత అందుబాటులోకి వచ్చే అవకాశం ఏర్పడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ అధునాతన పునరుత్పత్తి సాంకేతికతలలో పశువైద్య పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు డాక్టోరల్ పరిశోధకులకు విలువైన అవకాశాలను కూడా అందించింది.

వర్సిటీ కృషికి ప్రముఖుల ప్రశంసలు…

ఈ వినూత్న కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం చేసిన కృషిని టిటిడి అందించిన ఆర్థిక సహాయాన్ని ప్రముఖులు అభినందించారు. స్వదేశీ పశు సంరక్షణ, ఉత్పాదకత పెంపు కోసం పునరుత్పత్తి బయోటెక్నాలజీల అనువర్తనంలో 56 ఐవిఎఫ్  సాహివాల్ దూడలను ఉత్పత్తి చేసిన విజయం ఒక ముఖ్యమైన మైలురాయిగా గుర్తించబడింది. ఈ కార్యక్రమంలో పశువైద్య శాస్త్ర డీన్ డా.ఆర్.వి. సురేష్ కుమార్, పరిశోధన సంచాలకురాలు డా. సి.హెచ్. శ్రీలత, విస్తరణ సంచాలకురాలు డా. బి. శోభమణి, పరీక్షల సంచాలకురాలు డా. కె. ఆదిలక్ష్మమ్మ మరియు సివిఎసిసి, టిపిటి అసోసియేట్ డీన్ డా.పి.మలకొండయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశుసంపద అభివృద్ధి కోసం తమ తమ కార్యకలాపాల పాత్రను వివరించారు. పశుసంపద అభివృద్ధి, స్వావలంబన, సుస్థిర గ్రామీణ శ్రేయస్సు అనే భారతదేశ లక్ష్యాలకు దోహదపడేలా, శాస్త్రీయ పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణ, సహకార సంస్థాగత మద్దతు ద్వారా దేశీయ పశుసంపద వనరులను బలోపేతం చేయడానికి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ పశువైద్య విశ్వవిద్యాలయం కట్టుబడి ఉందని దీని పునరుద్ఘాటించింది.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్