చిన్నారి రుతిక వైద్యానికి రూ.2,20,503 విరాళం
పెడన, మేజర్ న్యూస్ : పట్టణానికి చెందిన ఆరేళ్ల చిన్నారి యక్కల రుతిక తీవ్రమైన బ్లడ్ క్యాన్సర్‌తో చిన్నారికి బోన్ మ్యారో చికిత్స అవసరం కావడంతో ఆర్థిక సహాయం అందించాలని చిన్నారి తండ్రి యక్కల పరమేశ్వరరావు దేవాంగ యూత్ సేవా సమితిని కోరగా కొంత నగదును ఆర్థిక సహాయం కింద అందించామని దేవాంగ యూత్ సభ్యులు తెలిపారు. ఈ మేరకు స్పందించిన దాతలు మొత్తం రూ.2,20,503 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా వారు ఒక ప్రకటనలో మాట్లాడుతూ విరాళాల మొత్తాన్ని పెడన పట్టణంలోని జోగానందరావు కాలనీలో చిన్నారి నివాసం వద్ద తండ్రి యక్కల పరమేశ్వరరావుకు అందించామన్నారు . అనంతరం ఊటుకూరి సుధీర్ కుమార్ మాట్లాడుతూ, తమ పిలుపు మేరకు స్పందించి చిన్నారి వైద్యానికి ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్క దాతకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపామన్నారు. పోలవరం ఐక్యవేదిక సభ్యులు కూడా ప్రత్యేక చొరవ చూపి పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించడం అభినందనీయమన్నారు. దాతలందరి ఆశీస్సులతో చిన్నారి రుతిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దేవాంగ యూత్ సేవా సమితి సభ్యుడు పింజల రవీంద్ర, పోలవరం ఐక్యవేదికకు చెందిన బుసం తులసి మోహన్, నక్కిన ఉమా మహేశ్వర రావు,వుట్ల మల్లికార్జున కరుపర్తి రామచంద్రరవు,తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెడన నియోజకవర్గం, కృష్ణాజిల్లా.