సాంప్రదాయంగా తులసి దామోదర కళ్యాణం
జగ్గయ్యపేట మేజర్ న్యూస్ : కార్తీక మాసం చిలకా ద్వాదశి సందర్భంగా తులసి దామోదర స్వామి అమ్మ వాళ్ళ కళ్యాణం వేడుకగా జరిగింది. శనివారం పట్టణంలోని విజయవాడ రోడ్లో కొలువై ఉన్న రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి వారి ఆలయంలో స్వామి అమ్మ వాళ్లకు విశేష అర్చనలు ఆలయ అర్చకులు శ్రీరంగం శ్రీనివాసచార్యులు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో తులసి దామోదర స్వామి అమ్మ వాళ్ళ కళ్యాణం సందర్భంగా ఉసిరి చెట్టుకు తులసి చెట్టుకు అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం తులసి దామోదర కళ్యాణాన్ని ఆగమ శాస్త్ర ప్రకారం అర్చకులు శ్రీరంగం శ్రీనివాసచార్యులు నిర్వహించారు. కళ్యాణ క్రతువులలో సీనియర్ పాత్రికేయులు అల్లి రవిచంద్ ఊర్వశి దంపతులు పాల్గొన్నారు. కంకణ దారుణ, యజ్ఞోపవేదంజీలకర్ర బెల్లం , మాంగళ్య ధారణ,ముత్యాల తలంబ్రాలు వంటి క్రతువులను వేదమంత్రాల నడుమ భక్తుల గోవింద నామ స్మరణల తో నిర్వహించారు. ఈ సందర్భంగా తులసీ దామోదర కళ్యాణ విశిష్టతను అర్చకులు భక్తులకు తెలియజేశారు. కళ్యాణ అనంతరం గర్భాలయంలోని స్వామి అమ్మ వాళ్లకు కర్పూర హారతులు ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. విశేష సంఖ్యలో భక్తులు తులసీ దామోదర కల్యాణాన్ని వీక్షించి ఆధ్యాత్మికతకు లోనయ్యారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, జగ్గయ్యపేట నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా.