BREAKING
సాంప్రదాయంగా తులసి దామోదర కళ్యాణం ఘనంగా యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా .. 5వ కౌన్సిల్ సమావేశాలు ఆప్యాయ పలకరింపులతో ఓటర్లను ఆకట్టుకుంటున్న మోదుగుముడి వెంకటేశ్వరరావు. నేడు మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం గూడవల్లి సర్పంచ్‌గా నెరుసు నీల మణిఈశ్వరరావు (నిఖిల్) ఏకగ్రీవ ఎన్నిక.. తాడిగడప 13వ వార్డులో బోడే ప్రసాద్ ఎన్నికల ప్రచారం అవనిగడ్డ మండలంలో రెండో రోజు కోలాహలంగా నామినేషన్లు వన సమారాధనలు సామాజిక ఐక్యతకు ప్రతీకలు పట్టణాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత కార్తీక వన సమారాధనలో మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఇంద్రకీలాద్రిపై వైభవంగా కార్తీక మాస పూజలు ఇంద్రకీలాద్రిపై ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ మేయర్, డిప్యూటీ మేయర్ ప్రమాణ స్వీకారం.. ట్రాఫిక్ ఆంక్షలు రౌడీషీటర్లు, సస్పెక్ట్‌లకు పోలీసుల కౌన్సెలింగ్

పట్టణాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత

Select Suryaa Now
పట్టణాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత

తాడిగడప, మేజర్ న్యూస్: పట్టణాల సమగ్ర అభివృద్ధి తెలుగుదేశం, జనసేన పార్టీలతోనే సాధ్యమని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ అన్నారు. తాడిగడప మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం 20వ వార్డు యనమలకుదురు డొంక రోడ్డు ప్రాంతంలో ఆయన విస్తృతంగా పర్యటించి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, పట్టణాల అభివృద్ధికి మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, నాణ్యమైన రహదారులు, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాలు ఎంతో అవసరమని అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. 20వ వార్డు టీడీపీ అభ్యర్థి తుమ్ము అశోక చక్రవర్తి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పీతా గోపీచంద్‌లకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అభ్యర్థి తుమ్ము అశోక చక్రవర్తి, వార్డు ఇన్‌చార్జిలు రాజుల ఫణి, సయ్యద్ అజ్మతుల్లా బాబు, 20వ వార్డు టీడీపీ అధ్యక్ష, కార్యదర్శులు, బూత్ ఇన్‌చార్జిలు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. 

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.