BREAKING
సాంప్రదాయంగా తులసి దామోదర కళ్యాణం ఘనంగా యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా .. 5వ కౌన్సిల్ సమావేశాలు ఆప్యాయ పలకరింపులతో ఓటర్లను ఆకట్టుకుంటున్న మోదుగుముడి వెంకటేశ్వరరావు. నేడు మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం గూడవల్లి సర్పంచ్‌గా నెరుసు నీల మణిఈశ్వరరావు (నిఖిల్) ఏకగ్రీవ ఎన్నిక.. తాడిగడప 13వ వార్డులో బోడే ప్రసాద్ ఎన్నికల ప్రచారం అవనిగడ్డ మండలంలో రెండో రోజు కోలాహలంగా నామినేషన్లు వన సమారాధనలు సామాజిక ఐక్యతకు ప్రతీకలు పట్టణాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత కార్తీక వన సమారాధనలో మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఇంద్రకీలాద్రిపై వైభవంగా కార్తీక మాస పూజలు ఇంద్రకీలాద్రిపై ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ మేయర్, డిప్యూటీ మేయర్ ప్రమాణ స్వీకారం.. ట్రాఫిక్ ఆంక్షలు రౌడీషీటర్లు, సస్పెక్ట్‌లకు పోలీసుల కౌన్సెలింగ్

రౌడీషీటర్లు, సస్పెక్ట్‌లకు పోలీసుల కౌన్సెలింగ్

Select Suryaa Now
రౌడీషీటర్లు, సస్పెక్ట్‌లకు పోలీసుల కౌన్సెలింగ్

విజయవాడ, మేజర్ న్యూస్: నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు, రూరల్ డీసీపీ బి. లక్ష్మీనారాయణ ఐపీఎస్ సూచనలతో నందిగామ ఏసీపీ సి.హెచ్. శ్రీనివాసరావు పర్యవేక్షణలో జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు, లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్‌లు, చెడు నడత కలిగిన వ్యక్తులకు పోలీసులు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, నేరాలకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తనతో జీవించాలని, గంజాయి, మత్తు పదార్థాల వినియోగం, రవాణా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెడు వ్యసనాలను విడనాడి మంచి నడవడిక అలవర్చుకోవాలని సూచించారు. రౌడీషీటర్లు, క్రైమ్ సస్పెక్ట్‌లపై పోలీసుల నిఘా నిరంతరం ఉంటుందని, స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి గొడవలు, నేరాలకు పాల్పడినా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.