BREAKING
సాంప్రదాయంగా తులసి దామోదర కళ్యాణం ఘనంగా యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా .. 5వ కౌన్సిల్ సమావేశాలు ఆప్యాయ పలకరింపులతో ఓటర్లను ఆకట్టుకుంటున్న మోదుగుముడి వెంకటేశ్వరరావు. నేడు మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం గూడవల్లి సర్పంచ్‌గా నెరుసు నీల మణిఈశ్వరరావు (నిఖిల్) ఏకగ్రీవ ఎన్నిక.. తాడిగడప 13వ వార్డులో బోడే ప్రసాద్ ఎన్నికల ప్రచారం అవనిగడ్డ మండలంలో రెండో రోజు కోలాహలంగా నామినేషన్లు వన సమారాధనలు సామాజిక ఐక్యతకు ప్రతీకలు పట్టణాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత కార్తీక వన సమారాధనలో మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఇంద్రకీలాద్రిపై వైభవంగా కార్తీక మాస పూజలు ఇంద్రకీలాద్రిపై ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ మేయర్, డిప్యూటీ మేయర్ ప్రమాణ స్వీకారం.. ట్రాఫిక్ ఆంక్షలు రౌడీషీటర్లు, సస్పెక్ట్‌లకు పోలీసుల కౌన్సెలింగ్

అవనిగడ్డ మండలంలో రెండో రోజు కోలాహలంగా నామినేషన్లు

Select Suryaa Now
అవనిగడ్డ మండలంలో రెండో రోజు కోలాహలంగా నామినేషన్లు

అవనిగడ్డ, మేజర్ న్యూస్: పల్లె పోరు మూడో విడత ఎన్నికల్లో భాగంగా అవనిగడ్డ మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఆదివారం రెండో రోజు నామినేషన్ల స్వీకరణ కోలాహలంగా సాగింది. మండలంలోని 10 పంచాయతీల పరిధిలో సర్పంచ్ స్థానాలకు 27 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 103 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి. విష్ణు తెలిపారు. పంచాయతీల వారీగా అశ్వరావుపాలెం సర్పంచ్ స్థానానికి ఇద్దరు, వార్డు సభ్యులకు 11 మంది, అవనిగడ్డలో సర్పంచ్‌కు ముగ్గురు, వార్డు సభ్యులకు 27 మంది, పాత ఎడ్లలంకలో సర్పంచ్‌కు ముగ్గురు, వార్డు సభ్యులకు ఎనిమిది మంది, మోదుమూడిలో సర్పంచ్‌కు ఒకరు, వార్డు సభ్యులకు తొమ్మిది మంది నామినేషన్లు వేశారు. అలాగే పులిగడ్డలో సర్పంచ్‌కు ఇద్దరు, వార్డు సభ్యులకు 13 మంది, రామచంద్రపురంలో సర్పంచ్‌కు నలుగురు, వార్డు సభ్యులకు 10 మంది, రామకోటిపురంలో సర్పంచ్‌కు ఆరుగురు, వార్డు సభ్యులకు నలుగురు, దక్షిణ చిరువోలులంకలో సర్పంచ్‌కు ఇద్దరు, వార్డు సభ్యులకు ముగ్గురు, తుంగలవారిపాలెంలో సర్పంచ్‌కు ముగ్గురు, వార్డు సభ్యులకు ఆరుగురు, వేకనూరులో సర్పంచ్‌కు ఇద్దరు, వార్డు సభ్యులకు 12 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మండలంలోని ఐదు కేంద్రాల్లో జరుగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను రిటర్నింగ్ అధికారి విష్ణు, ఎస్ఐ కె. శ్రీనివాసరావు పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, అవనిగడ్డ నియోజకవర్గం, కృష్ణాజిల్లా.