BREAKING
సాంప్రదాయంగా తులసి దామోదర కళ్యాణం ఘనంగా యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా .. 5వ కౌన్సిల్ సమావేశాలు ఆప్యాయ పలకరింపులతో ఓటర్లను ఆకట్టుకుంటున్న మోదుగుముడి వెంకటేశ్వరరావు. నేడు మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం గూడవల్లి సర్పంచ్‌గా నెరుసు నీల మణిఈశ్వరరావు (నిఖిల్) ఏకగ్రీవ ఎన్నిక.. తాడిగడప 13వ వార్డులో బోడే ప్రసాద్ ఎన్నికల ప్రచారం అవనిగడ్డ మండలంలో రెండో రోజు కోలాహలంగా నామినేషన్లు వన సమారాధనలు సామాజిక ఐక్యతకు ప్రతీకలు పట్టణాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత కార్తీక వన సమారాధనలో మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఇంద్రకీలాద్రిపై వైభవంగా కార్తీక మాస పూజలు ఇంద్రకీలాద్రిపై ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ మేయర్, డిప్యూటీ మేయర్ ప్రమాణ స్వీకారం.. ట్రాఫిక్ ఆంక్షలు రౌడీషీటర్లు, సస్పెక్ట్‌లకు పోలీసుల కౌన్సెలింగ్

వన సమారాధనలు సామాజిక ఐక్యతకు ప్రతీకలు

Select Suryaa Now
వన సమారాధనలు సామాజిక ఐక్యతకు ప్రతీకలు

గన్నవరం, మేజర్ న్యూస్: కార్తీక మాసంలో నిర్వహించే వన సమారాధనలు ప్రకృతితో మమేకం కావడంతో పాటు సామాజిక ఐక్యతను, ఆత్మీయ అనుబంధాలను బలోపేతం చేసే చక్కని వేదికలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని నున్న యజ్ఞ గార్డెన్స్‌లో విజయవాడ శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వన సమారాధన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాల ద్వారా సంఘ సభ్యులు కుటుంబ సమేతంగా ఒకచోట చేరి పరస్పర పరిచయాలు, స్నేహ సంబంధాలను పెంపొందించుకోవచ్చని తెలిపారు. శెట్టిబలిజ సామాజిక వర్గంలో ఐక్యత, సామూహిక జీవనం, పరస్పర సహకార భావనను పెంపొందించుకోవాలని, ఇతర సామాజిక వర్గాలను గౌరవిస్తూ సోదరభావంతో ముందుకు సాగాలని సూచించారు. మధ్యతరగతి కుటుంబాలకు విద్యే గొప్ప ఆస్తి అని, పిల్లలకు నాణ్యమైన విద్య అందించి ఉన్నతంగా ఎదిగేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. విద్య ద్వారానే పిల్లలు జీవితంలో మంచి అవకాశాలను అందిపుచ్చుకుని కుటుంబాలకు, సమాజానికి గౌరవం తీసుకువస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలబాలికలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమం ప్రారంభంలో శెట్టిబలిజల జాతిపిత స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గుత్తుల సాయి, విజయవాడ శెట్టిబలిజ సంఘ నాయకులు, సంఘ సభ్యులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, గన్నవరం నియోజకవర్గం, కృష్ణాజిల్లా.