BREAKING
కేశినేని చిన్ని ఆధ్వర్యంలో మేయర్, కార్పొరేటర్లకు ఘన సత్కారం వైభవంగా శ్రీపంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం సర్పంచ్లకు 13, వార్డులకు 133 నామినేషన్లు జడ్పీటీసీ ఉదయ్ కుమార్ పూజలు చిన్నారి రుతిక వైద్యానికి రూ.2,20,503 విరాళం జగ్గయ్యపేటలో విజయవంతంగా సేవలందిస్తున్న బొజ్జా డెంటల్ సాంప్రదాయంగా తులసి దామోదర కళ్యాణం ఘనంగా యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా .. 5వ కౌన్సిల్ సమావేశాలు ఆప్యాయ పలకరింపులతో ఓటర్లను ఆకట్టుకుంటున్న మోదుగుముడి వెంకటేశ్వరరావు. నేడు మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం గూడవల్లి సర్పంచ్‌గా నెరుసు నీల మణిఈశ్వరరావు (నిఖిల్) ఏకగ్రీవ ఎన్నిక.. తాడిగడప 13వ వార్డులో బోడే ప్రసాద్ ఎన్నికల ప్రచారం అవనిగడ్డ మండలంలో రెండో రోజు కోలాహలంగా నామినేషన్లు వన సమారాధనలు సామాజిక ఐక్యతకు ప్రతీకలు పట్టణాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత

ఘనంగా యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా .. 5వ కౌన్సిల్ సమావేశాలు

Select Suryaa Now
ఘనంగా యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా .. 5వ కౌన్సిల్ సమావేశాలు

జగ్గయ్యపేట మేజర్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా కౌన్సిల్ జగ్గయ్యపేట శుభ మస్తు కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది . ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 12వ పిఆర్సి నివేదిక సమర్పించేలోగా రాష్ట్రంలోని ఉద్యోగులకి 29% మధ్యంతర భృతి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పి ఆర్సి కమిటీ నివేదిక ఆరు నెలల్లో ర ఇచ్చే విధంగా ఉండాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సరెండర్ లీవ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు . నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యుటిఎఫ్ 52 సంవత్సరాల కాలంలో విద్యారంగ పరిరక్షణ కోసం, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం, నిర్విరామంగా పనిచేస్తుందని, అందువల్లనే ఈరోజు యు టీ ఎఫ్ కి రాష్ట్రంలో అతిపెద్ద ఉద్యమ సంఘం పేరు ఉన్నదని దీనికోసం సంఘం లో అప్పారి వెంకట స్వామి, దాచురి రామిరెడ్డి, మైనేని వెంకటరత్నం వంటి అనేకమంది నాయకులు వారి జీవితాన్ని త్యాగాలు చేసి, వారి సర్వీస్ త్యాగం చేసి ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడారని , వారికి ఈ సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను అన్నారు. వారి మార్గంలో నేటి నాయకత్వం పనిచేసి ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణ కు, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం, వారి హక్కుల కోసం సంఘం ఆశయాలకు అనుగుణంగా పనిచేసే ఈ ప్రాంతంలో ఇంకా అతిపెద్ద ఉద్యమంగా యుటిఎఫ్ ను తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకు ముందు ఉదయం 9 గంటలకి పతాకావిష్కరణతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జాతీయ పతాకం

 ఎం.రమణ యు టీ ఎఫ్ సీనియర్ నాయకులు ఎస్ .టి.ఎఫ్.ఐ పతాకం ను కే.హనుమంత రావు 

యూటీఎఫ్ సీనియర్ నాయకులు యూటీఎఫ్ పతాకావిష్కరణ : మచ్చా శ్రీనివాస్ యూటీఎఫ్ పూర్వ జిల్లా గౌరవాధ్యక్షులుతో ఆవిష్కరణ చేయడం జరిగింది . అనంతరం ప్రారంభ సభ జిల్లా అధ్యక్షులు కుక్కడపు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది.ఈ సభ లో ప్రారంభ సందేశమును నక్కా వెంకటేశ్వర్లు అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కె.ఎస్.లక్ష్మణరావు పూర్వ శాసన మండలి సభ్యులు, జే.వి.వి రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ 2027 ఫిబ్రవరిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థి హనుమంతరావు కి గెలుపు కోసం యుటిఎఫ్ నాయకులు కృషి చేయాలని అదే విధంగా జిల్లాలో గల ఉపాధ్యాయులు ఈసారి అత్యంత నిజాయితీగా 2007 నుండి శాసనమండలిలో ఉద్యోగులు, ప్రజల పక్షాన నిలబడుతున్న పి.డి.ఎఫ్ ఎమ్మెల్సీలకు మరొక పర్యాయం మద్దతిచ్చి గెలిపించాలని పిలుపునిచ్చారు.ఇంకా ప్రారంభ సమావేశంలో నక్కా వెంకటేశ్వర్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుతో పాటు ఎం హనుమంతరావు , రాష్ట్ర కార్యదర్శి యస్ పి మనోహర్ కుమార్ , డి.వి.కృష్ణ సుఐటీయు ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు తదితరులు మాట్లాడారు . అనంతరం ప్రతినిధుల సభ జరిగింది ప్రతినిధుల సభలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ .సుందరయ్య గడిచిన సంవత్సరం కాలంలో యుటిఎఫ్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కోసం చేసిన కార్యకలాపాలు, ఉద్యోగుల ఆర్థిక బకాయిల కోసం, పిఆర్సి కోసం, టెట్ రద్దు కోసం చేసిన ఉద్యమాల కార్యకలాపాలు, సంఘం నిర్మాణ నివేదికని , శాఖల పనితీరుని వివరిస్తూ రిపోర్టుని ప్రవేశపెట్టారు. ఆర్థిక నివేదిక ను కే .గంగ రాజు ఎన్టీఆర్ జిల్లా కోశాధికారి ప్రవేశ పెట్టారు. ఆడిట్ నివేదిక ఏ అనంత కుమార్ కన్వీనర్, ఆడిట్ కమిటీ ,, మహిళా నివేదిక : పి. భవాని జిల్లా సహాధ్యక్షురాలు, పలు విద్యా విషయక, వృత్తి, ఆర్థిక సంబంధ తీర్మానాలు ప్రవేశ పెట్టి ఆమోదించారు. అనంతరం నూతన కమిటీ ఎన్నికల జరుగాయి ఎన్నికల అధికారిగా బి. సుభాషిణి రాష్ట్ర కార్యదర్శి వ్యవహరించారు.. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే శ్రీనివాసరావు ఏ సుందరయ్య జిల్లా సహాధ్యక్షులు ఎం కృష్ణయ్య జిల్లా గౌరవ అధ్యక్షుడు మహేశ్వర వెంకటేశ్వరరావు, జిల్లా కోశాధికారి ఏ గంగరాజు, సహజ అక్షరాలు పి. భవాని రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పి లీల , జిల్లా కార్యదర్శులు బి రమణయ్య బీ.సీ.హెచ్ సూర్యనారాయణ బి రెడ్ స్టార్ , ఎన్ ముత్తయ్య, ఏం లలిత శ్రీ, కె.నాగేశ్వర రావు, పి. రామా రావు, జే సుధానంద్, మండల నాయకులు జి ముక్తేశ్వరరావు అల్లిక నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు. 

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, జగ్గయ్యపేట నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా.