BREAKING
కేశినేని చిన్ని ఆధ్వర్యంలో మేయర్, కార్పొరేటర్లకు ఘన సత్కారం వైభవంగా శ్రీపంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం సర్పంచ్లకు 13, వార్డులకు 133 నామినేషన్లు జడ్పీటీసీ ఉదయ్ కుమార్ పూజలు చిన్నారి రుతిక వైద్యానికి రూ.2,20,503 విరాళం జగ్గయ్యపేటలో విజయవంతంగా సేవలందిస్తున్న బొజ్జా డెంటల్ సాంప్రదాయంగా తులసి దామోదర కళ్యాణం ఘనంగా యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా .. 5వ కౌన్సిల్ సమావేశాలు ఆప్యాయ పలకరింపులతో ఓటర్లను ఆకట్టుకుంటున్న మోదుగుముడి వెంకటేశ్వరరావు. నేడు మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం గూడవల్లి సర్పంచ్‌గా నెరుసు నీల మణిఈశ్వరరావు (నిఖిల్) ఏకగ్రీవ ఎన్నిక.. తాడిగడప 13వ వార్డులో బోడే ప్రసాద్ ఎన్నికల ప్రచారం అవనిగడ్డ మండలంలో రెండో రోజు కోలాహలంగా నామినేషన్లు వన సమారాధనలు సామాజిక ఐక్యతకు ప్రతీకలు పట్టణాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత

వైభవంగా శ్రీపంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం

Select Suryaa Now
వైభవంగా శ్రీపంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం

చల్లపల్లి మేజర్ న్యూస్ : చల్లపల్లి మండలం నడకుదురు పంచాయతీ శివారు పాతనడకుదురులో కరకట్టపక్కనే సర్వాంగ సుందరంగా నిర్మితమైన శ్రీపంచముఖ ఆంజనేయస్వామి వారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టామహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం గం.9.031లకు అశ్వనీ నక్షత్రయుక్త ధనుర్లగ్న పుష్కరాంశమందు శ్రీగణపతి, శ్రీసు బ్రహ్మణ్యేశ్వరస్వామి, శ్రీనాగేంద్రస్వామి, శ్రీపంచముఖ ఆంజనేయస్వామి వార్ల శిఖర, విగ్రహ, యంత్ర ప్రతిష్టామహోత్సవం దంపతుల చేతులమీదుగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రాణప్రతిష్ట జీవన్యాసము, నాడీసంధానము, మహాకుంభాభిషేకము, మహాపూర్ణాహుతి, దశదర్శనము, విప్రధేను తృణాగ్ని కార్యక్రమాల అనంతరం శ్రీసీతారాముల కళ్యాణం జరిగింది. ఆగమ ప్రతిష్టాచార్య చావలి దుర్గామల్లిఖార్జున దీక్షితుల బ్రహ్మత్వంలో వేదపండితులు ప్రతిష్టాకార్యక్రమాలను జరిపారు. శ్రీఆంజనేయ ఛారిటబుల్ ట్రస్ట్ నడకుదురు ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం, ప్రతిష్టామహోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ట్రస్ట్ ఫౌండర్ పెద్దిబోయినన వెంకట శ్రీనివాసరావు - వెంకట శివపార్వతి దంపతులతో పాటు పలువురు దంపతులు, దాతలు ప్రతిష్టామహోత్సవ పూజల్లో పాల్గొన్నారు. విశ్రాంత ఆర్టీవో నాదెళ్ల శివరామకృష్ణ, కమిటీ పెద్దలు, స్థానిక పెద్దలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రతిష్టామహోత్సవం సందర్భంగా వేలాది మంది భక్తులకు అన్నసమారాధన జరిగింది. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి ప్రతిష్టామహోత్సవంలో పాల్గొన్నారు. అవనిగడ్డ డీఎస్పీ అభిషేక్, చల్లపల్లి సీఐ కె.ఈశ్వరరావు, ఎస్ఐ డి.దుర్గాంజనేయులు ప్రతిష్టామహోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు సిబ్బంది బందోబస్తు చేపట్టారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, అవనిగడ్డ నియోజకవర్గం, కృష్ణాజిల్లా.