BREAKING
కేశినేని చిన్ని ఆధ్వర్యంలో మేయర్, కార్పొరేటర్లకు ఘన సత్కారం వైభవంగా శ్రీపంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం సర్పంచ్లకు 13, వార్డులకు 133 నామినేషన్లు జడ్పీటీసీ ఉదయ్ కుమార్ పూజలు చిన్నారి రుతిక వైద్యానికి రూ.2,20,503 విరాళం జగ్గయ్యపేటలో విజయవంతంగా సేవలందిస్తున్న బొజ్జా డెంటల్ సాంప్రదాయంగా తులసి దామోదర కళ్యాణం ఘనంగా యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా .. 5వ కౌన్సిల్ సమావేశాలు ఆప్యాయ పలకరింపులతో ఓటర్లను ఆకట్టుకుంటున్న మోదుగుముడి వెంకటేశ్వరరావు. నేడు మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం గూడవల్లి సర్పంచ్‌గా నెరుసు నీల మణిఈశ్వరరావు (నిఖిల్) ఏకగ్రీవ ఎన్నిక.. తాడిగడప 13వ వార్డులో బోడే ప్రసాద్ ఎన్నికల ప్రచారం అవనిగడ్డ మండలంలో రెండో రోజు కోలాహలంగా నామినేషన్లు వన సమారాధనలు సామాజిక ఐక్యతకు ప్రతీకలు పట్టణాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత

సర్పంచ్లకు 13, వార్డులకు 133 నామినేషన్లు

Select Suryaa Now
సర్పంచ్లకు 13, వార్డులకు 133 నామినేషన్లు

చల్లపల్లి మేజర్ న్యూస్ : గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం రెండవ రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. చల్లపల్లి మండలంలో 11 గ్రామ పంచాయతీలకు గాను చల్లపల్లి, లక్ష్మీపురం, పాగోలు, వక్కలగడ్డ, మంగళాపురం, నడకుదురులో నామినేషన్ సెంటర్లను ఏర్పాటుచేశారు. సర్పంచ్ అభ్యర్థులుగా 13 మంది, వార్డు అభ్యర్థులుగా 133 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మంగళాపురం సర్పంచ్ అభ్యర్థులుగా పరుచూరి శ్రీదేవి, రావెళ్ల సుజాత, మాజేరులో తోట ధనసూర్యావతి, వెలివోలులో వేములమడ సతీష్బాబు(రెండవ సెట్), పురిటిగడ్డలో కర్రా సురేష్బాబు, కర్రా రమేష్బాబు, బడుగు అనిల్ కుమార్, బెజవాడ సునీల్, యార్లగడ్డలో ముదునూరి లక్ష్మి, బుర్రె సత్యవేణి, నడకుదురులో పుట్టి వెంకటేశ్వరమ్మ, వక్కలగడ్డలో మల్లుపెద్ది దుర్గామహేష్లు నామినేషన్లు వేశారు. రెండు రోజుల నామినేషన్లు కలిపి మొత్తం సర్పంచ్ స్థానాలకు 29, వార్డు స్థానాలకు 218 నామినేషన్లు దాఖలు కాగా, సోమవారం చివరి రోజు కావటంతో మరికొన్ని నామినేషన్లు దాఖలు కానున్నాయి.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, అవనిగడ్డ నియోజకవర్గం, కృష్ణాజిల్లా.