BREAKING
వైభవంగా శ్రీపంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం సర్పంచ్లకు 13, వార్డులకు 133 నామినేషన్లు జడ్పీటీసీ ఉదయ్ కుమార్ పూజలు చిన్నారి రుతిక వైద్యానికి రూ.2,20,503 విరాళం జగ్గయ్యపేటలో విజయవంతంగా సేవలందిస్తున్న బొజ్జా డెంటల్ సాంప్రదాయంగా తులసి దామోదర కళ్యాణం ఘనంగా యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా .. 5వ కౌన్సిల్ సమావేశాలు ఆప్యాయ పలకరింపులతో ఓటర్లను ఆకట్టుకుంటున్న మోదుగుముడి వెంకటేశ్వరరావు. నేడు మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం గూడవల్లి సర్పంచ్‌గా నెరుసు నీల మణిఈశ్వరరావు (నిఖిల్) ఏకగ్రీవ ఎన్నిక.. తాడిగడప 13వ వార్డులో బోడే ప్రసాద్ ఎన్నికల ప్రచారం అవనిగడ్డ మండలంలో రెండో రోజు కోలాహలంగా నామినేషన్లు వన సమారాధనలు సామాజిక ఐక్యతకు ప్రతీకలు పట్టణాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత కార్తీక వన సమారాధనలో మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

నేడు మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం

Select Suryaa Now
నేడు మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం

పెడన మేజర్ న్యూస్: పురపాలక సంఘం ఎన్నికలలో విజయం సాధించిన చైర్మన్, కౌన్సిలర్ సభ్యుల ప్రమాణ స్వీకారం నేడు జరగనున్నది. పడన పట్టణంలో మొత్తం 28 వార్డులకు గాను టీడీపీ 19, జనసేన 6, వైఎస్ఆర్సిపి 3, కౌన్సిలర్ లు గెలుపొందారు. జనసేన పార్టీ నుండి చైర్మన్ అభ్యర్థి బళ్ళ జ్ఞాన లింగ జోష్నారాణి విజయం సాధించారు. నేడు అనగా సోమవారం ప్రత్యేక ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమక్షంలో వీరందరితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రమాణ స్వీకరానికి ముందు మున్సిపల్ చైర్ పర్సన్, కూటమి ప్రభుత్వం కౌన్సిలర్లు పట్టణంలో ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, జనసేన నియోజకవర్గం సమన్వయకర్తలు కొరియర్ శ్రీను, లింగం నాగేశ్వరరావు,అంకెం లక్ష్మీ శ్రీనివాస్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటల నుంచి ప్రమాణ స్వీకారాల కార్యక్రమం ప్రారంభం కానున్నాయి. దీంతో మున్సిపల్ కార్యాలయం చుట్టూ ఫ్లెక్సీలు బ్యానర్స్ తో అంగరంగ వైభవంగా మున్సిపల్ కార్యాలయం ముస్తాబు కానున్నది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రానున్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెడన నియోజకవర్గం, కృష్ణాజిల్లా.