BREAKING
వైభవంగా శ్రీపంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం సర్పంచ్లకు 13, వార్డులకు 133 నామినేషన్లు జడ్పీటీసీ ఉదయ్ కుమార్ పూజలు చిన్నారి రుతిక వైద్యానికి రూ.2,20,503 విరాళం జగ్గయ్యపేటలో విజయవంతంగా సేవలందిస్తున్న బొజ్జా డెంటల్ సాంప్రదాయంగా తులసి దామోదర కళ్యాణం ఘనంగా యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా .. 5వ కౌన్సిల్ సమావేశాలు ఆప్యాయ పలకరింపులతో ఓటర్లను ఆకట్టుకుంటున్న మోదుగుముడి వెంకటేశ్వరరావు. నేడు మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం గూడవల్లి సర్పంచ్‌గా నెరుసు నీల మణిఈశ్వరరావు (నిఖిల్) ఏకగ్రీవ ఎన్నిక.. తాడిగడప 13వ వార్డులో బోడే ప్రసాద్ ఎన్నికల ప్రచారం అవనిగడ్డ మండలంలో రెండో రోజు కోలాహలంగా నామినేషన్లు వన సమారాధనలు సామాజిక ఐక్యతకు ప్రతీకలు పట్టణాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత కార్తీక వన సమారాధనలో మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

ఆప్యాయ పలకరింపులతో ఓటర్లను ఆకట్టుకుంటున్న మోదుగుముడి వెంకటేశ్వరరావు.

Select Suryaa Now
ఆప్యాయ పలకరింపులతో ఓటర్లను ఆకట్టుకుంటున్న మోదుగుముడి వెంకటేశ్వరరావు.

గన్నవరం, మేజర్ న్యూస్ : గన్నవరం గ్రామ వైఎస్సార్‌సీపీ సర్పంచి అభ్యర్థి మోదుగుముడి వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి ఆదరాభిమానాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. కులమతాలకు అతీతంగా అందరితో కలిసిమెలిసి సాగుతున్న ఆయన ప్రచారం గ్రామంలో ప్రత్యేకంగా కనిపిస్తోంది. ప్రజలతో మమేకమవుతూ గ్రామ సమస్యలు, స్థానిక అవసరాలపై ఆరా తీస్తున్నారు. అందరినీ కలుపుకొని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తూ ఓటర్ల మద్దతు కోరుతున్నారు. ప్రచారంలో ఆయన చూపుతున్న ఆత్మీయత, ప్రజలతో మెలిగే తీరు చర్చనీయాంశంగా మారుతోంది. సర్పంచి అభ్యర్థిగా తనకు కేటాయించిన గంప గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మోదుగుముడి వెంకటేశ్వరరావు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, గన్నవరం నియోజకవర్గం, కృష్ణాజిల్లా.