తాడిగడప 13వ వార్డులో బోడే ప్రసాద్ ఎన్నికల ప్రచారం
తాడిగడప, మేజర్ న్యూస్: తాడిగడప మున్సిపాలిటీ 13వ వార్డులో కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి కౌన్సిలర్ అభ్యర్థి సరిహద్దు విజయ రాజేశ్వరి, చైర్మన్ అభ్యర్థి పీతా గోపిచంద్‌కు మద్దతుగా వార్డులోని ప్రతి వీధిలో పర్యటిస్తూ ప్రజలు, వ్యాపారులను ఆప్యాయంగా పలకరించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ తాడిగడప మున్సిపాలిటీని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమికి మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే రహదారులు, డ్రైనేజీలు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేసిందని బోడే ప్రసాద్ తెలిపారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలకు సైతం అభివృద్ధి ఫలాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే ప్రజల మద్దతు అవసరమని, అభివృద్ధి పనులు చేసి చూపించే నాయకత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. చైర్మన్ అభ్యర్థి పీతా గోపిచంద్‌తో పాటు 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సరిహద్దు విజయ రాజేశ్వరిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.