BREAKING
సాంప్రదాయంగా తులసి దామోదర కళ్యాణం ఘనంగా యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా .. 5వ కౌన్సిల్ సమావేశాలు ఆప్యాయ పలకరింపులతో ఓటర్లను ఆకట్టుకుంటున్న మోదుగుముడి వెంకటేశ్వరరావు. నేడు మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం గూడవల్లి సర్పంచ్‌గా నెరుసు నీల మణిఈశ్వరరావు (నిఖిల్) ఏకగ్రీవ ఎన్నిక.. తాడిగడప 13వ వార్డులో బోడే ప్రసాద్ ఎన్నికల ప్రచారం అవనిగడ్డ మండలంలో రెండో రోజు కోలాహలంగా నామినేషన్లు వన సమారాధనలు సామాజిక ఐక్యతకు ప్రతీకలు పట్టణాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత కార్తీక వన సమారాధనలో మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఇంద్రకీలాద్రిపై వైభవంగా కార్తీక మాస పూజలు ఇంద్రకీలాద్రిపై ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ మేయర్, డిప్యూటీ మేయర్ ప్రమాణ స్వీకారం.. ట్రాఫిక్ ఆంక్షలు రౌడీషీటర్లు, సస్పెక్ట్‌లకు పోలీసుల కౌన్సెలింగ్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

Select Suryaa Now
కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: పవిత్ర కార్తీక మాసం, ఆదివారం సెలవు దినం, భవానీ మండల దీక్షల స్వీకరణ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తెల్లవారుజాము నుంచే కనకదుర్గ అమ్మవారి దర్శనం, భవానీ దీక్షా మాలధారణ కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు కిటకిటలాడాయి. భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు దేవస్థానం అధికారులు ఉదయం 10 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను నిలిపివేసి సామాన్య భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. స్కానింగ్ పాయింట్ వద్ద ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమాదేవి, టెంపుల్ ఏఈవో రమేష్ బాబు, డీఈఈ అశోక్ కుమార్ భక్తుల రద్దీని క్రమబద్ధీకరించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ కొండపైన, దిగువ ప్రాంతాల్లో పర్యటించి దర్శన క్యూలైన్లు, ఉచిత ప్రసాద పంపిణీ కేంద్రాలను పరిశీలించారు. ఘాట్ రోడ్డు, కనకదుర్గ నగర్ వైపు నుంచి వచ్చే వృద్ధులు, దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత బ్యాటరీ వాహనాల సేవలను తనిఖీ చేసి, నిరంతరాయంగా అందించాలని సిబ్బందిని ఆదేశించారు. భక్తుల ఫీడ్‌బ్యాక్‌లో వెల్లడైన సమస్యలను సంబంధిత ఇంజినీరింగ్, ఇతర విభాగాల అధికారులు వెంటనే పరిష్కరించాలని, సమస్యలను తెలియజేసిన భక్తులతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడి పరిష్కార వివరాలు తెలియజేయాలని ఈవో సూచించారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.