BREAKING
సాంప్రదాయంగా తులసి దామోదర కళ్యాణం ఘనంగా యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా .. 5వ కౌన్సిల్ సమావేశాలు ఆప్యాయ పలకరింపులతో ఓటర్లను ఆకట్టుకుంటున్న మోదుగుముడి వెంకటేశ్వరరావు. నేడు మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం గూడవల్లి సర్పంచ్‌గా నెరుసు నీల మణిఈశ్వరరావు (నిఖిల్) ఏకగ్రీవ ఎన్నిక.. తాడిగడప 13వ వార్డులో బోడే ప్రసాద్ ఎన్నికల ప్రచారం అవనిగడ్డ మండలంలో రెండో రోజు కోలాహలంగా నామినేషన్లు వన సమారాధనలు సామాజిక ఐక్యతకు ప్రతీకలు పట్టణాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత కార్తీక వన సమారాధనలో మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఇంద్రకీలాద్రిపై వైభవంగా కార్తీక మాస పూజలు ఇంద్రకీలాద్రిపై ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ మేయర్, డిప్యూటీ మేయర్ ప్రమాణ స్వీకారం.. ట్రాఫిక్ ఆంక్షలు రౌడీషీటర్లు, సస్పెక్ట్‌లకు పోలీసుల కౌన్సెలింగ్

కార్తీక వన సమారాధనలో మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

Select Suryaa Now
కార్తీక వన సమారాధనలో మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

ఉయ్యూరు, మేజర్ న్యూస్ : కార్తీక మాసంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ అన్నారు. ఉయ్యూరు మండలం చిన్న ఓగిరాల మారుతి నగర్‌లోని అభయాంజనేయస్వామి ఆలయ సన్నిధిలో నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్తీక మాసంలో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భక్తుల్లో భక్తిభావం, ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందుతాయని అన్నారు. భక్తి కార్యక్రమాలతో పాటు అన్న సమారాధన నిర్వహిస్తూ భక్తులను ఒకచోట చేర్చి ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వెనిగండ్ల కుటుంబరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు పాలడుగు రామకృష్ణ, పాలడుగు ప్రసాద్, యార్లగడ్డ సాయి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.